రాధాపై రెక్కీ.. ఎవరీ అరవ సత్యం?

Publish Date:Dec 30, 2021

Advertisement

బెజవాడ అంటేనే కులాల చిచ్చు రగిలే నగరం. గతంలో అప్పట్లో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న జాతి వైరం రాష్ట్ర రాజకీయాల పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉండేది. ప్రస్తుతానికి వస్తే.. దివంగత వంగవీటి రంగా కుమారుడు రాధా టీడీపీలోను, దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ వైసీపీలో ఉన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ వీరి మధ్య వివాదాలు లేవనే చెప్పాలి. అయితే.. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లు వంగవీటి రాధా ఇటీవల చేసిన  వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి. రాధాపై రెక్కీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ సత్యం ఎవరనేది పలువురిలో ఆసక్తిగా ఉంది. రాధా హత్యకు కుట్ర చేసింది రాజకీయ నాయకులే అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.

వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించిన వ్యక్తి అరవ సత్యం అనే ఊహాగానాలు వస్తుండడంతో పోలీసులు అరవ సత్యాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి . వాస్తవానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్నాడు అరవ సత్యం. అరవ సత్యం ఉరఫ్ వెంకట సత్యనారాయణ దేవినేని కుటుంబానికి వీర విధేయుడు. వైసీపీ యువనేత దేవినేని అవినాష్కు అత్యంత సన్నిహితుడునే పేరుంది. అరవ సత్యంను కొందరు రౌడీ అని, ఇంకొందరు గూండా అని చెబుతుంటారు.  యాదవ సామాజిక వర్గానికి చెందిన అరవ సత్యం దేవినేనితో అత్యంత సన్నిహితుడుగా మెలగడం కీలకమైన విషయం అంటారు.

వెంకట సత్యనారాయణ అనే తనపై 1992లో ప్రత్యర్థులు ఓ కేసులో ఇరికించినప్పుడు అరవ సత్యం అనే ముద్ర వేశారట. సత్యం కుటుంబం తెలుగువారే. అరవ సత్యం ఒకటో తరగతి నుంచి సూర్యారావుపేటలోని ప్రగతి నికేతన్లో చదివాడు. అరవ సత్యానిది ఒకప్పుడు మధ్య తరగతి కుటుంబం. సత్యం తండ్రి ఇంజిన్ ఆయిల్ వ్యాపారం చేసేవారు. అరవ సత్యంకు భార్య, కొడుకు ఉన్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సత్యానికి అత్యంత ఖరీదైన క్యూ 7 ఉంది. తన కొడుక్కి జాగ్వార్ కారు కొని ఇవ్వడం విశేషం.

దూకుడుగా ఉండే అరవ సత్యం కెరీర్ ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనివాడిగా మొదలైంది. 2002లొ విజయవాడ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యాడు. బీసీ సంఘాలతో బాగా తిరుగుతాడు. దేవినేని కుటుంబానికి వీర విదేయుడిగా ఉంటూ, నెహ్రూ ఆశయాలన సాధన కోసమే అవినాష్కు అనుంగు అనుచరుడిగా వ్యవహరిస్తున్న అరవ సత్యం పేరు వంగవీటి రాధా రెక్కీ వ్యాఖ్యలతో మరోసారి తెరమీదకు రావడం గమనార్హం. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.