తాగండి తూలండి.. కానీ పడకండి.. వావ్, వాట్ యాన్ ఐడియా..
Publish Date:Dec 30, 2021
Advertisement
న్యూఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయండి. పార్టీలు చేసుకోండి. అర్థ రాత్రి 12 కాదు, వన్ ఓ క్లాక్’ వరకు పీకల వరకు ఎంజాయ్ చేయండి. ఎంత తాగాలనుకుంటే అంత తాగండి .. చిందు లేయండి.. కానీ .. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించండి.. మాస్కులు తీయకండి .. భౌతిక దూరం పాటించండి ... చిందులు వేయండి .. డాన్స్’లు చేయండి కానీ, ఒకరి మీద ఒకరు పడకండి .....ఒక వేళ పడ్డారే అనుకోండి.. నథింగ్ టూ వర్రీ .., మీ తాగుడు బిల్లుకు ఇంకో వెయ్యో వందో కలుస్తుంది. అది ఫైన్ అన్నమాట.. తాగండి .... మా వాళ్ళు .. మీరు ..బార్లో ఉన్నా ...పబ్బులో ...క్లబ్బులో ఎక్కడున్నా మీ మీద ఒక కన్నేసే ఉంచుతారు. సో .. మీరు భయం లేకుండా .. డెబిట్ ..క్రెడిట్ కార్డులు ఖాళీ అయ్యే వరకు తాగండి. .. పీకల దాకా తాగి .. చిందులేస్తూ ... ఆనందించండి .. మీ ఆనందమే మా (ప్రభుత్వ) సౌభాగ్యం ... సో .. మీరు ఇంకేమీ ఆలోచించకండి.. తాగండి .. కానీ, కొవిడ్ ప్రోటోకాల్స్ మరిచిపోకండి. ఏంటి పీకల దాక తాగి, కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలా .. హౌ ..ఎలా సాధ్యం అంటారా ... ఏంటి ..మళ్ళీ .. మీరు ఇంతకే అంత ఇదైపోతేఎలా... న్యూ ఇయర్ వేడుకలు ‘ప్రశాంత’ వాతావరణంలో జరిగేలా చూసేందుకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు బాసులు ... చాలా చక్కని ప్రణాళికను రూపొందించారు. సరే ..ఎప్పుడులానే కొన్ని రోడ్లు, ఫ్లై ఓవర్లు 31 నైట్ 10 పీఎం నుంచి కొత్త సంవత్సరం సూర్యోదయం వరకు మూసి ఉంచుతారు. అంతేకాదు, తాగుబోతుల సౌకర్యార్ధం మన పోలీసు బాసులు ఆటో,క్యాబ్ డ్రైవర్లకు, గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. మందు బాబులు ఎక్కడి రమ్మంటే అక్కడికి వెళ్ళ వలసిందే, కాదంటే రూ. 500 ఫైన్ ..అలాంటి ఫిర్యాదుల కోసం మన మంచి పోలీసు బాసులు వాట్సఆప్ 9490617346 కూడా ఇచ్చారు. ఇంతే కాదు, ఇంకా ఉన్నాయి .. సర్కారు వారే తాగమన్నారు కదా అని, పీకల దాకా తాగేసి, ఝూమ్మని కార్లోనో, బైక్ మీదనో మీరే డ్రైవింగ్ చేసుకుంటూ పోతామంటే ఊరుకోరు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. డ్రంక్ డ్రైవింగ్ ఈజ్ యాన్ ఆఫెన్స్ యూ నో.. సో .. మేరు పూటుగా తాగేసి ఝూమ్మంటూ పోతామంటే రూల్స్ ఒప్పుకోవు. మీరు అలా వెళ్ళగానే మీ జేబులోకి పోలీసుల చెయ్యి వెళ్ళిపోతుంది. అందుకోసంగా 100 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎంతైనా ప్రజలు క్షేమమే ప్రభుత్వమే ప్రధాన లక్ష్యం కదా అందుకని, బార్, పబ్ లోంచి బయటకు వచ్చిన మీకు బార్, పబ్ యజమానులు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద పాతలు చెపుతారు. ఎడ్యుకేట్ చేస్తారన్న మాట ... ఒక వేళ యజమానులు అలాంటి ఏర్పాట్లు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఎలోచేస్తే, వాళ్ళమీద కూడా కేసులు, జరిమానాలు ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరానికి పాల్పడితే అది మొదటిసారి అయితే రూ.10,000 ఫైన్, ఆరు నెలలు జైలు, రెండవసారైతే రూ15000 ఫైన్, రెండు సంవత్సరాల జైలు .. ఇలా ఇంకు చాలానే ఉన్నాయి. అయితే, ఇంత కష్టపడి,తాగించడం ఎందుకు ..తాగిన తర్వాత ఈ ఫైన్లు, జైళ్ళు ఎందుకు అంటారా.. డబ్బులు ఎవరికీ ఊరికే రావు ..కోటి విద్యలూ ఖజానా నింపుకోవదానికే..సర్’కారు’కు కూడా సొమ్ములు కావలి .. కదా ..
http://www.teluguone.com/news/content/govt-controversial-rules-on-new-year-celebratuins-39-129372.html





