బేబీ బాస్ వరల్డ్ రికార్డు.!

Publish Date:Jul 23, 2026

Advertisement

క్రికెట్ లో బేబీ బాస్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల పసి ప్రాయంలోనే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేసి సంచలనాలు సృష్టిస్తున్నాడు.  పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్, అతి పిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికట్ లో అడుగుపెట్టిన తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే   ప్రపంచ రికార్డు తిరగరాశాడు.  జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన  టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్  సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.

ఇంగ్లండ్‌తో ఆడిన తొలి మూడు  మ్యాచ్ లలోనూ సిక్సర్లు బాదినా భారీ స్కోరు చేయడంలో విఫలమై నిరాశ పరిచిన ఈ కుర్రోడు..  జింబాబ్వేపై చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తిరగరాసిన వరల్డ్ రికార్డులు ఏమిటంటే..   టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయసులో   హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్.. ఇంతకు ముందు ఈ రికార్డు  లూయిస్ బ్రూస్ (16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది.  అయితే పూర్తిస్థాయి సభ్య దేశాల ఆటగాళ్లలో ఈ రికార్డు  ఆఫ్ఘ‌నిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (17 ఏళ్ల 296 రోజులు) పేరిట ఉంది.

 అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20) కలిపి పూర్తిస్థాయి సభ్య దేశాల తరఫున అతి పిన్న వయసులో తొలి అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్థాన్‌పై సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ బద్దలుకొట్టాడు.  

అసోసియేట్ దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో 50+ స్కోరు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా సూర్యవంశీ నిలిచాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశల్ మల్లా 15 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డును కూడా అధిగమించి భారత క్రికెట్‌లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు.

Vaibhav Suryavamshi world record, Zimbabwe, t20match, Halfcentury

By
en-us Political News

  
కొత్త చట్టం తెస్తున్న కేంద్ర ప్రభుత్వం..వచ్చే వారమే పార్లమెంట్‌లో బిల్లు..!
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతంపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది.
కేటీఆర్ జన్మదిన వేడుకలలో శుక్రవారం (జులై 24నపాల్గొన్న ఆయన తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారం, వదంతులు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రతిష్ఠకు భంగం కలిగేలా పింక్ డైమండ్ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ గతంలో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది.
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.