ఎన్నికల దగ్గరపడుతుంటే ప్రతి పార్టీ, ప్రత్యర్థి పార్టీని.. ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా విమర్శించడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. గతంలో కేసీఆర్ కేంద్ర కార్మికమంత్రిగా పనిచేసిన సమయంలో స్కాం చేసారని, దాని నుంచి బయటపడటానికే బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా, టీజేఎస్ నేత విద్యాధరరెడ్డితో కలిసి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. 2006లో కేసీఆర్ కేంద్ర కార్మికమంత్రిగా ఉన్నపుడు ఈఎస్‌ఐ కార్పొరేషన్ ద్వారా నిర్మించాల్సిన వైద్య కళాశాల భవనాల పనులను నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు కాకుండా అప్పటికే కేసుల్లో ఇరుక్కున్న వెలుగుబంటి సూర్యనారాయణ ద్వారా నాటి ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖకు కట్టబెట్టారని ఉత్తమ్ తెలిపారు. ఈ కాంట్రాక్ట్ మత్స్యశాఖకు ఇవ్వడం కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు పూర్తి విరుద్ధమన్నారు. కేసీఆర్ ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి ఈఎస్‌ఐసీ అధికారులను పిలిపించుకుని కాంట్రాక్ట్ ఇప్పించారని సీబీఐ తన ఛార్జిషీట్ లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఆ మేరకు కేసీఆర్‌పై కేసు కూడా నమోదు చేశారని అన్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. బీజేపీ నాయకుల ద్వారా మోదీతో కుమ్మక్కై సీబీఐ ఛార్జిషీట్ లోని తన పేరుని కేసీఆర్ తొలగింపజేసుకున్నారని ఉత్తమ్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కేసీఆర్ లాలూచీపడినందునే ఇది సాధ్యమయ్యిందని పేర్కొన్నారు. అందుకే విభజన చట్టంలోని హామీల అమలుపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడటంలేదన్నారు. ఛార్జిషీట్ లో ఉన్న కేసీఆర్ పేరును ఎందుకు తొలగించారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. భవన నిర్మాణ కాంట్రాక్ట్ వెలుగుబంటి సూర్యనారాయణకు ఇచ్చింది నిజం కాదా? ఆ గుత్తేదారుతో కేసీఆర్ సంబంధం నిజం కాదా? అని ప్రశ్నించారు. వైద్య,కంటి పరీక్షల పేరుతో కేసీఆర్ ఢిల్లీకి తిరిగిందంతా కూడా తనపై ఉన్న సీబీఐ కేసును తొలగించుకునేందుకే అని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైనపుడు బహిర్గతం చేస్తామని ఉత్తమ్ తెలిపారు.
టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నపుడే బీడీ కట్టలపై పుర్రెగుర్తు వచ్చిందని, ఇది లక్షల మంది బీడీ కార్మికులకు నష్టం కలిగించిందని ఆరోపించారు. సహారా సంస్థ రూ.7000 కోట్ల పీఎఫ్ నిధులు వాడుకునేందుకూ కేసీఆర్ అప్పుడే అనుమతిచ్చారని ఇది భారీ కుంభకోణమన్నారు. సీబీఐ అధికారులు విచారణకు రావడంతోనే ట్యాంక్‌బండ్‌పై ఒకసారి బతుకమ్మ వేడుకలకు సీఎం రావాల్సి ఉన్నా రాలేదన్నారు. గత 83 రోజులుగా ఎన్నికల్లో టీఆర్ఎస్ రూ.వెయ్యికోట్లకు పైగా ఖర్చు చేసిందని, మరో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయనుందని రమణ ఆరోపించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/uttam-kumar-reddy-comments-on-kcr-role-in-esi-and-sahara-pf-scams-39-84659.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.