చైనా చేతిలో అమెరికా ఓటర్ల డేటా.!
Publish Date:Jul 31, 2026
Advertisement
డ్రాగన్ దేశం చేతికి అమెరికా ఓటర్ల డేటా చిక్కింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ స్వయంగా ప్రకటించింది. అమెరికాకు చెందిన 22 కోట్ల మంది పౌరుల ఓటరు నమోదు వివరాలు చైనా, దాని అనుబంధ సైబర్ హ్యాకింగ్ వర్గాల చేతికి చిక్కిందని యూఎస్ అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని కూడా చైనా హ్యాకర్లు చేజిక్కించుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు సైతం నిర్ధారించాయి. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఎన్నికల వ్యవస్థల భద్రతపై అమెరికాలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం వైట్ హౌస్ ప్రకటన అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. పౌరుల వ్యక్తిగత డేటాను చోరీకి చైనా అనుబంధ సైబర్ ముఠాలు డార్క్ వెబ్ ఆధారిత కొనుగోళ్లు, అధునాతన హ్యాకింగ్ పద్ధతులను ఉపయోచించాయని ఆ నివేదిక వెల్లడించింది. సాధారణ ప్రజలకు అందుబాటులో లేని సమాచారాన్ని సైతం ఈ రకంగా హ్యాకింగ్ ద్వారా చైనా చోరీ చేయడం వెనుక భారీ కుట్ర, వ్యూహం ఉన్నాయని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తున్నది. శత్రు దేశాల చేతికి కోట్లాది మంది పౌరుల సున్నిత సమాచారం చిక్కితే అది సాధారణ డేటా లీక్ గా పరిగణించి తేలికగా తీసుకోవడానికి లేదు. ఈ డేటా లీక్ దేశ భద్రతకురపెను ముప్పుగా అమెరికా అభివర్ణిస్తోంది. ఓటర్ల వ్యక్తిగత వివరాలు ప్రత్యర్థి దేశాల చేతికి వెడితే.. ఆ దేశాలు పోలింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఓటర్ల డేటాబేస్‌లో చిన్న మార్పులు చేయడం ద్వారా అసలైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవడం లేదా పోలింగ్ రోజున కేంద్రాల వద్ద గందరగోళం సృష్టించడం వంటి దుశ్చర్యలకు పాల్పడే ఆస్కారం ఉందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ డేటాను ఉపయోగించి ప్రచార వేదికలపై ఓటర్ల ఆలోచనలను, మనోభావాలను ప్రభావితం చేసే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. US voter data hack, China cyber interference, White House allegation, US election security, NSA CIA intelligence report
డ్రాగన్ దేశం చేతికి అమెరికా ఓటర్ల డేటా చిక్కిన విషయం వైట్‌హౌస్ ప్రభుత్వ పారదర్శకత టాస్క్‌ఫోర్స్ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్ తో బయటపడింది. అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ ఇటీవల విదేశీ జోక్యానికి సంబంధించిన నిఘా పత్రాలను బహిర్గతం చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ లో ఈ సంచలనం వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫ్యాక్ట్ షీట్ ను ఏదో మామూలు నివేదికగా తీసిపారేయడానికి లేదని అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా నిఘా సంస్థలు ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ), సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలు క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించాయి.
http://www.teluguone.com/news/content/us-voters-data-in-china-hands-36-227601.html





