దేవినేని ఉమాతో విభేదాలున్నాయా?.. ఎమ్మెల్యే వసంత కృష్ణ క్లారిటీ..!

Publish Date:Jul 31, 2026

Advertisement

 

మైలవరం రాజకీయాలు, వీటీపీఎస్ ఫ్లై యాష్ రవాణా వివాదం, పార్టీ అంతర్గత అంశాలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్థానిక సమస్యల పరిష్కారం నుంచి సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుతో కలిసి పనిచేసే అంశం వరకు పలు విషయాలపై స్పందించారు. స్థానిక లారీ యజమానుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు వారి తరఫున తాను చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

రిఫెక్స్ సంస్థ ప్రతినిధులు, లారీ అసోసియేషన్‌ల మధ్య అవగాహన కుదిరేలా కృషి చేశామని చెప్పారు. ఒప్పందం ప్రకారం ప్రతి నెల 12 నుంచి 15 లారీల ఫ్లై యాష్‌ను స్థానికులకు ఉచితంగా కేటాయించేలా, అదనంగా అవసరమైతే నిర్ణీత రుసుము చెల్లించి తీసుకెళ్లేలా పరిష్కారం లభించిందని వివరించారు.పార్టీ అంతర్గత అంశాలపై కూడా ఎమ్మెల్యే స్పందించారు. 

సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుతో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి మహానాడు నిర్వహణలో పార్టీ ప్రోటోకాల్ ప్రకారమే వ్యవహరించానని, తాను జూనియర్ నాయకుడిగా తన బాధ్యతల మేరకే పనిచేస్తానని చెప్పారు.గత ఎన్నికల్లో 43 వేల ఓట్ల భారీ మెజారిటీ టీడీపీ కార్యకర్తలు, కూటమి భాగస్వామ్య పార్టీల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో చర్చలకే ప్రాధాన్యం ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.

 

MLA Vasantha Venkata Krishna Prasadm, Mylavaram MLA, VTPS Fly Ash Issue,
Fly Ash Controversy, Refex Company, Lorry Owners Protest,Tender Dispute

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
తెలంగాణరాష్ట్రంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నాలుగు గోడల మధ్యే తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 2020 ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల కేసులో న్యాయస్థానం అత్యంత సంచలనాత్మక తుది తీర్పును వెలువరించింది.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశ ఇంధన భద్రత, వ్యవసాయ రంగం, క్రీడలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేస్తూ ప్రధాని
ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా డా. నరేంద్రకుమార్‌ నియామకం..!
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం
తెలంగాణలోని ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.
చనిపోయిందని వైద్యులు తేల్చేస్తే.. రోడ్డు గుంత ప్రాణం పోసింది..!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసంరి లయన్స్.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఏలూరు జిల్లా పరిధిలోని బొగ్గు గనుల బ్లాకులను రిలయన్స్ దక్కించుకోవడంతో ఇంకే మాత్రం జాగు లేకుండా ఈ బిగ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.