అమెరికా స్థావరాలపై ఇరాన్ భారీ దాడులు.!
Publish Date:Jul 30, 2026
Advertisement
మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వైరం మధ్య ప్రాచ్యాన్ని యుద్ధ భూమిగా మార్చేసింది. అమెరికాకు కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. బహ్రెయిన్‌లోని ప్రసిద్ధ షేక్ ఇసా వైమానిక స్థావరంలోని అమెరికా మౌలిక సదుపాయాలు, కీలక సైనిక ఆస్తులపై ఐఆర్‌జీసీ డ్రోన్లతో భారీ స్థాయిలో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో అమెరికా దళాలకు విద్యుత్ సరఫరా చేసే పవర్ జనరేటర్లు, వైమానిక సర్వీసులు, నావిగేషన్ వ్యవస్థలు, ఎడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడితో పశ్చిమాసియాలో అమెరికా సైనిక కార్యకలాపాలు స్తంభించిపోయే వాతావరణం ఏర్పడింది. కాగా బహ్రెయిన్‌కే పరిమితం కాకుండా, పొరుగున ఉన్న ఇతర దేశాల్లోని అమెరికా స్థావరాలపైనా ఇరాన్ ఏకకాలంలో దాడులకు పాల్పడింది. కువైట్‌లోని అలీ అల్ సేలం వైమానిక స్థావరం, జోర్డాన్‌లోని అల్-అజ్రక్ వైమానిక స్థావరాలపై కూడా ఇరాన్, డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులను స్వయంగా ఐఆర్‌జీసీ ప్రకటించింది. బుధవారం (జులై 29) రాత్రి ఇరాన్ సరిహద్దులోని ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ భారీ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ వాణిజ్యానికి నాడి లాంటి హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలు, ఇంధన ట్యాంకర్లకు ఇరాన్ ముప్పుగా మారిందంటూ, అమెరికా గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఇరాన్ స్థావరాలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా దాడులకు ఇరాన్ కూడా అధునాతన క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల అమెరికా వైమానిక స్థావరాలపై నిరంతర దాడులకు పాల్పడుతూ దీటుగా బదులిస్తోంది. Iran drone attacks, Bahrain Kuwait, IRGC drone strike, Middle East war tensions
http://www.teluguone.com/news/content/iran-launches-massive-attacks-on-us-bases-36-227600.html





