యూపీలో గెలుపెవరిదంటే.. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్...
Publish Date:Mar 7, 2022
Advertisement
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సుదీర్ఘంగా సాగాయి. మోదీ-యోగీ ద్వయం బాగా చెమటోడ్చింది. సమాజ్‌వాదీ పార్టీ వేగంగా పుంజుకుంది. ప్రియాంకగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అదృష్టం పరీక్షించుకుంది. పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. అందరికంటే, అధికార బీజేపీ మరింత కష్టపడింది. మోదీ గ్రాఫ్ పడిపోవడం.. రైతు చట్టాలు, రైతు హత్యలు.. యోగి వివాదాస్పద అంశాలు.. ఇలా కమలనాథులకు యూపీ ఎలక్షన్స్ అగ్నిపరీక్ష పెట్టాయి. ఆ పరీక్ష ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎమ్‌లలో భద్రంగా ఉంది. లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ ఉత్కంఠ కంటిన్యూ కానుంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ముందే కూస్తున్నాయి. గెలుపెవరిదో స్పష్టంగానే చెబుతున్నాయి. ఈసారి బీజేపీ గట్టెక్కడం కష్టమనే అనుకుంటున్నారంతా. కాకపోతే టఫ్ ఉన్నా.. ఎలాగోలా బయటపడుతామనే ఆశ కమలనాథుల్లో. అయితే, ఆ ఆశా అడియాశే అంటోంది ఎగ్జిట్ పోల్. యూపీలో వార్ వన్‌సైడ్‌గా జరిగినట్టు అంచనా వేసింది. కషాయదళంకు ఓటర్లు కర్రు కాల్చి వాతపెట్టబోతున్నారంటూ హింట్ ఇస్తోంది. యూపీలో బీజేపీకి దారుణ పరాజయం తప్పదంటున్నాయి ఎగ్జిట్ పోట్స్. హైదరాబాద్‌కి చెందిన ఆత్మసాక్షి గ్రూప్.. యూపీ ఎలక్షన్స్‌పై ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ చేసింది. ఆ ఫలితాలు సంచలనంగా ఉండబోతున్నాయని తెలిపింది. బీజేపీ కేవలం 138-140 సీట్లకే పరిమతం అవుతుందని అంటోంది. మోదీ-యోగిల మాయ ఈసారి యూపీలో వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. సమాజ్‌వాది-ఎస్పీ పార్టీ మాత్రం 235-240 సీట్లతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని చెబుతోంది. బీఎస్పీకి 19-23.. కాంగ్రెస్‌కు 12-16 సీట్లు వస్తాయనేది ఆత్మసాక్షి గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్.
http://www.teluguone.com/news/content/up-exit-poll-results-by-atmasakshi-group-39-132705.html





