పంజాబ్ కింగ్ ఎవరు? ఎగ్జిట్ పోల్స్‌లో సంచలనం..
Publish Date:Mar 7, 2022
Advertisement
యూపీ తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది పంజాబ్ ఎన్నికలే. అక్కడంత ప్రముఖులెవరూ లేకున్నా.. మోదీ కాంట్రవర్సీతో పంజాబ్ హీట్ పీక్స్‌కు చేరింది. ప్రధాని కాన్వాయ్‌ని రైతులు అడ్డుకోవడం.. మోదీ వెనక్కి తిరిగి వెళ్లిపోవడం.. తాను ప్రాణాలతో బయటపడినందుకు థ్యాంక్స్ అంటూ రచ్చ రాజేయడం.. కోర్టులు, కమిషన్ల వరకూ వివాదం ముదరడంతో పంజాబ్ ఎలక్షన్స్ రంజుగా, పసందుగా సాగాయి. మోదీనే అడుగుపెట్టనీయలేదంటే.. పంజాబ్ రైతులు బీజేపీపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అప్పుడే తేలిపోయింది. మూడు రైతు చట్టాలు ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో ఉరి వేయడం ఖాయమని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కష్టాలు కాషాయదళానికి కలిసొస్తాయనే చిన్నిఆశ. కెప్టెన్ అమరేందర్‌సింగ్ సీఎం కుర్చీ దిగిపోయి.. కాంగ్రెస్‌ను వీడిపోవడం పార్టీని డ్యామేజ్ చేస్తుందని అనుకున్నారు. ఇక కాంగ్రెస్‌లో చన్నీకి, సిద్ధుకి మధ్య ఆధిపత్య పోరు.. గెలిస్తే చన్నీనే సీఎం అవుతారని పార్టీ ప్రకటనతో కాస్త టెన్షన్ క్రియేట్ అయింది. మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ సైలెంట్‌గా తనపని తాను చేసుకుపోవడం.. కేజ్రీవాల్ అండర్‌కరెంట్‌గా ఫుల్ క్యాంపెయిన్ చేయడంతో.. పంజాయ్ ఓటింగ్ సరళిపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తాజాగా, హైదరాబాద్‌కు చెందిన ఆత్మసాక్షి గ్రూప్.. పంజాబ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. ఆ రిజల్ట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్ కొనసాగుతుందని అనుకున్నారంతా. కానీ, బీజేపీ సోదిలో కూడా లేకుండా పోయిందని.. పోరు అంతా కాంగ్రెస్, ఆప్‌ల మధ్యే జరిగిందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆత్మసాక్షి గ్రూప్ సర్వే.. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 58-61 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఆప్ అనూహ్యంగా పుంజుకొని 34 నుంచి 38 సీట్లు కొట్టగొడుతుందని తెలుస్తోంది. ఇక, బీజేపీ 4-5 సీట్లకే పరిమితం అవుతుందని.. శిరోమణి అకాలీదళ్ మాత్రం 18-21 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపింది.
http://www.teluguone.com/news/content/punjab-exit-polls-results-39-132710.html





