తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత ఎండమావే!

Publish Date:Jul 2, 2022

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత అన్నది ఎండమావిలాగే తయారైంది. అన్ని వర్గాలూ గ్రూపు విభేదాలు మరచి కలిసి పని చేస్తున్నట్లు కనిపించినా.. వేటికవి గానే కాలుదువ్వుతుంటాయి. తాజాగా కాంగ్రెస్ లో విభేదాల తుట్టె కదిలింది. అందుకు రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి  య శ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక కారణమైంది. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు విషయంలో ఎటువంటి రెండో అభిప్రాయం లేకపోయినా.. ఆయన ముందుగా టీఆర్ఎస్ ఎంపీలను కలవడం, ఆ తరువాత తమను కలుస్తాననడం కాంగ్రెస్ కు రుచించలేదు.

అందుకే కేసీఆర్ ఆధ్వర్యంలో యశ్వంత్ సిన్హాతో ఏర్పాటు చేసిన భేటీకి, అలాగే ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేశామన్నారు. ఒకటి రెండు రోజుల తరువాత హస్తినలో యశ్వంత్ సిన్హాను కలిసి మద్దతు తెలుపుతామని రేవంత్ చెప్పారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి యశ్వంత్ సిన్హాను కలవడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. అందులోనూ కేసీఆర్ సమక్షంలోనే వీహెచ్ యశ్వంత్ సిన్హాకు బొకే ఇచ్చి అభినందనలు తెలపడం పుండుమీద కారం చల్లినట్లైంది. దీనిపై రేవంత్ ఫైర్ అయ్యారు.

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదనీ గోడకేసి కొడతామని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా యశ్వంత్ సిన్హాను పార్టీ తరఫున ఎవరూ కలవలేదనీ, వ్యక్తిగతంగా ఎవరైనా కలిసి ఉంటే అది తమకు సంబంధం లేదని రేవంత్ అన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వీహెచ్ పై రేవంత్ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడానికి రేవంత్ ఎవరంటూ రెచ్చిపోయారు.  గోడకేసి కొడతామన్న వ్యాఖ్యలను రేవంత్ వెనక్కు తీసుకుని కాంగ్రెస్ కు, వీహెచ్ కు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. యశ్వంత్‌ను వీహెచ్‌ కలిసింది కేసీఆర్‌ ఇంటి వద్ద కాదని, ఎయిర్‌పోర్టులో అని పేర్కొన్నారు.

రాజకీయంగా కాంగ్రె్‌సకు ప్రధాన శత్రువు బీజేపీ అని, ఆ తరువాతే టీఆర్‌ఎస్‌ అని జగ్గారెడ్డి చెప్పారు.   పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌ అసలు పనికిరాడన్నారు. కాగా, రేవంత్‌పై జగ్గారెడ్డి బహిరంగ విమర్శలు క్రమశిక్షణా రాహిత్యమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అధిష్ఠానం వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకే రేవంత్‌రెడ్డి మాట్లాడారని తెలిపారు. రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఇరువురు పార్టీకి రెండు కళ్లలా పని చేస్తున్నారన్నారు.  

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.