భాగ్యనగరంలో కాషాయం, గులాబీల కదన కుతూహలం
Publish Date:Jul 2, 2022
Advertisement
ఒకరికి మించి ఒకరు వాగ్ధాటితో తమ సత్తాను ప్రదర్శించుకోవడంలో తగ్గే పరిస్థితుల్లో లేరు. ఒకరిది ఆధి పత్యంలోకి రావాలన్న ఉత్సహం, మరొకరికి అందుకు అస్సలు అవకాశమీయకూడదన్న కుతూ హలం. ఇద్దరి మధ్య పూర్వపు స్నేహఛాయలు పోయి కదనానికి కాల్దువ్వుతున్న సమయం ఇది. దీనికి వేదిక హైదరాబాద్, ఆ రెండు.. బిజెపి, టిఆర్ ఎస్! తెలంగాణాలో వేళ్లూనుకున్న టిఆర్ ఎస్ పార్టీకి వారి స్థాయిని తెలియజేయాలన్న కమలదళ పతుల ఆతృత. తన ఇలాకాలోకి వచ్చి తననే అధికారంలోంచి దించేందుకు సాహసించే దమ్ము ధైర్యం ఎక్కడిదని నిలదీస్తున్న టిఆర్ ఎస్. ఒకవంక బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వేదిక కాగా, మరో వంక హైదరాబాద్ టిఆర్ ఎస్ వారి భారీ ర్యాలీకి కాషాయధారులను హెచ్చరించడానికి పూను కున్న కదన కుతూహలం! కదన వ్యూహం తో వచ్చిన కాషాయ దళం, గులాబీ కోటని డీ కొడుతుందా, ఇంతకాలం విమర్శలు ప్రతి విమర్శలతో సాగిన కాషాయ గులాభీ యుద్ధం ఇంక ప్రత్యక్యం గా జరుగుతుందా. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను విమర్శించే గులాబీదళానికి చెక్ పెట్టేందుకు కాషాయదళం కదిలి వచ్చింది . తెలంగాణా లో పాగా వేయడం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే చెప్పాలి. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలు, 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలే ప్రధాన అజెండా గా సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అత్యధిక రాష్ట్రాలలో అధికారం లో వున్న కమలం పార్టీ ఈసారి తెలంగాణా లో పాగా వేయడానికి చాల తీవ్రంగా కృషి చేస్తోంది. తెలంగాణాలో అధికారం లో వున్న టి ఆర్ ఎస్ పార్టీ బిజేపి ని చాలా తీవ్రం గా వ్యతిరేకిస్తోంది.అందువల్ల బి జే పి పార్టీ నాయకత్వం మరింత దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రజలలో తె రా సా కి ప్రత్యామ్న్యాయం బి జే పి అనే నమ్మకాన్ని కల్పించగలిగామని, ఆదివారం జరిగే బహిరంగ సభ తరవాత ప్రజలలో నమ్మకం మరింత కలుగుతుందని తెలంగాణా బిజెపి నాయకుల విశ్వాసం. ఐతే మా ములుగానే బిజేపి మీద విమర్శలు చేసే టిఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ లో నిర్వహించే సభలో ప్రధాన అజండా విద్వేషాలు లేపడం అని, అసమర్దాపాలన చేస్తున్న ప్రధాని అని, విమర్శలు చేస్తున్నా రు. టిఆర్ ఎస్ పాలనలో ప్రజలు ఎవరు కూడా సుఖంగా సంతోషంగా లేరు అని, బి జే పి నాయకులూ ఆరోపిస్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం తప్ప ప్రజలకి చేసింది ఏమి లేదని ప్రజల అభిప్రాయం.కేంద్రం లో బా జ ప చేస్తుంటే రాష్ట్రం లో తె రాసా ప్రజలకి అన్యాయం చేస్తోంది. సామాన్య ప్రజల బ్రతుకులు దినదిన గండం నురేల్ల ఆయుషు ల వుంది.నిత్యావసర వస్తువులు గాని,పెట్రోల్ డీసెల్ గాని, గ్యాస్ ఏ వస్తువులు ఐనా కోనే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కేంద్రం ఏం సహాయం చేయకపోయీనా మేము యంతో ప్రగతి సాదించం అని రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ పధకాలకి పేర్లు మార్చి మా పధకాలు అని చెప్పుకుంటున్నారని బిజెపి శ్రేణులు ఇలా చెప్పుకోవడం తప్ప ఒరిగింది ఏమి లేదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా లక్షం ఒకటే అధికారం.అధికారం లోకి రావడం కోసం ప్రజలకి ఎన్నో హామీ లు ఇవ్వడం తప్ప హమిలని నిలబెట్టుకోవడం ఏ పార్టీ కి కూడా చేతకాదు.కే సీ ఆర్ కి బాయ్ చెప్ప డానికి ప్రజలు సిద్దం గా వున్నారని అని, వచ్చే ఎన్నికలలో తమదే విజయమని బిజెపీ శ్రేణులు అంటున్నాయి. కేంద్రం లో బిజెపి కి ప్రత్యామ్నయం కోసం కే సీ ఆర్ చేసిన ప్రయత్నాలు తెలియనివి కాదు. నేరుగా మంత్రి మీదే విమర్శలు చేస్తున్న గులాభీ బాస్. హైదరాబాద్ లో సమావేశం లో ప్రసంగమే కాకుండా ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పాలి అని చెప్తున్నారు,
http://www.teluguone.com/news/content/bjp-trs-campaigb-fight-in-hyderbad-39-138950.html





