అన్నదాతకు సంకెళ్లా.. తెలంగాణలో రైతు సంక్షేమం ఇదేనా?

Publish Date:Jul 2, 2022

Advertisement

దేశానికి అన్నం పెట్టేది రైతు. ఆరుగాలం కష్టపడి తన శ్రమకు ఫలితం దక్కకపోయినా తాను పస్తులుండి కూడా ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టాలనేది రైతు నైజం. నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతకు ఆత్మగౌరం లేకుండా పోతోంది. వేల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టుల కోసం తాము తమకు బదుకు దెరువు చూపే భూములను ఇచ్చిన రైతులు పరిహారం కోసం ఏళ్లుగా పోరాటం చేయాల్సిన పరిస్థితి. పోరాడినా న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదు.

నిరన తెలిపినందుకు, కడుపు మండి రోడ్డు ఎక్కినందుకు చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. చివరకు సంకెళ్లు వేసుకుని ఉగ్రవాదుల్లా కోర్టు మెట్లు ఎక్కాల్సి దుస్థితి నెలకొంది. రైతు, రైతుబాంధవుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రైతుల బతుకులు బాగవుతున్నాయని ప్రచారం చేసుకునే అధికార పార్టీ నేతలు, మంత్రులు, రూ.50 వేల కోట్లు రైతు బంధు ఇచ్చామని యాసంగిలో సంబరాలు చేసుకున్న నేతలు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు వేసిన బేడీలపై నోరు మెదపడం లేదు.

గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను.. నేరస్థులు, టెర్రరిస్టులను తీసుకువచ్చినట్టు సంకెళ్లతో కోర్టులో హాజరుపరిచారు. పరిహారం కోసం జూన్‌ 14న హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద చేపట్టిన ఆందోళన ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు గుడాటిపల్లికి చెందిన 17 మంది నిర్వాసిత రైతులపై కేసులు పెట్టారు. వీరిలో నలుగురిని అదేరోజు అరెస్టు చేయగా.. మిగిలిన వారు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియదు. నలుగురిని అదే రోజు రిమాండ్‌చేసిన పోలీసులు, 14 రోజుల తర్వాత గురువారం హుస్నాబాద్‌ కోర్టుకు తీసుకొచ్చారు. తమ వారిని సంకెళ్లతో చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. 2017 ఏప్రిల్‌లో ఖమ్మంలోనూ మద్దతు ధర కోసం ఆందోళన చేసిన పది మంది రైతులను ఇలాగే సంకెళ్లతో కోర్టుకు తీసుకురావడం అప్పట్లో దుమారం రేపింది. తాజాగా మరోసారి రైతులకు సంకెళ్లు వేయడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల హైదరాబాద్‌లో ఓమైనర్‌ బాలికపై అధికార పార్టీకి చెందిన నేతల కొడుకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో సాక్షాధారాలు బయటకు వచ్చే వరకు కూడా పోలీసులు నేతల కొడుకులు లేరని చెప్పుకొచ్చారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన రెండు రోజులకు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. చివరకు అరెస్ట్‌ చేసిన తర్వాత కూడా నిందితులకు పోలీసులు రాచమర్యాదలు చేయడం, ఇళ్ల నుంచి, హోటళ్ల నుంచి బిచార్యనీలు తెప్పించి ఇచ్చారు. పరిహారం అడిగిన పాపానికి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు మాత్రం ఇలా సంకెళ్లు వేశారు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిపాటు పంజాబ్‌ రైతులు డిల్లీలో ఉద్యమించారు. ఈ పోరాటంలో పంజాబ్‌కు చెందిన రైతులు చనిపోయారు. రైతు ఉద్యమంతో ప్రధాని నరేంద్రమోదీ దిగివచ్చారు. చట్టాలను ఉపసంహరించుకుని దేశ రైతులకు క్షమాపణలు చెప్పారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ రైతు బాంధవుడని రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల పంజాబ్‌కు వెళ్లి మరీ పరిహారం అందించారు. సొంత రాష్ట్రంలో రైతులు అన్నమో రామచంద్రా అని అంగలారుస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. కడుపు మండి పోరాటం చేస్తే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టిస్తున్నాడు సదరు రైతు బాంధవుడు. ఇదేనా బంగారు తెలంగాణ అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.