పోటెన్సీ టెస్ట్‌పై హైకోర్టుకు ఉదయ్ కృష్ణారెడ్డి.!
Publish Date:Aug 24, 2026
Advertisement
హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసు కుంది. పోటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించారు. అదే సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాల మధ్య ఉదయ్ కృష్ణారెడ్డికి పోటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. అయితే కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారించనుంది. Uday Krishnareddy petition in High court, Potency, test, Trainee, IPS
http://www.teluguone.com/news/content/uday-krishnareddy-petition-in-high-court-24-229665.html





