ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి పోటెన్సీ టెస్ట్‌పై ట్విస్ట్..!

Publish Date:Sep 1, 2026

Advertisement

 

ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహించాలంటూ రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ స్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు నేపథ్యంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డికి లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించాలని పోలీసులు కోరారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లోని III అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ XXV అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు 17న దర్యాప్తు అధికారికి అనుమతి ఇచ్చింది.

 BNSSలోని సెక్షన్ 52 ప్రకారం ఈ పరీక్షకు అనుమతి ఇచ్చినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అయితే కింది కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని సెక్షన్ల ప్రకారం పొటెన్సీ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులకు చట్టపరమైన అధికారం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. కేసు దర్యాప్తు సమగ్రంగా సాగేందుకు పొటెన్సీ పరీక్ష అవసర మని తెలిపారు. దర్యాప్తు లో భాగంగానే పరీక్షను కోరుతున్నామని కోర్టుకు వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ జె. శ్రీనివాసరావు తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహిం చాలా? వద్దా? అన్నది హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. ఉదయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు పొటెన్సీ పరీక్ష నిర్వహించబోమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో దర్యాప్తు అధికారిని పరీక్ష కోసం ఒత్తిడి చేయ వద్దని న్యాయమూర్తి ఆదేశించారు.. మంగళ వారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన అనంతరం తాజాగా వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ అయింది. తీర్పు వెలువడే వరకు ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుపైనే ఉత్కంఠ నెలకొంది.

 

Uday Krishna Reddy Potency Test, Rajendranagar Court, Telangana High Court, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, Hyderabad police, Telugu One, Telugu news
 

By
en-us Political News

  
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..!
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.