బాబు అరెస్టుకు రెండేళ్లు..

Publish Date:Sep 9, 2025

Advertisement

రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు..(అంటే సెప్టెంబర్ 9 2023) అప్పటి జగన్ సర్కార్ నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసింది. స్కిల్ కేసు అంటూ నంద్యాలలో బూబు షూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని తన బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబునాయుడిని నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ చేసి రాక్షసానందాన్ని పొందింది. నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్ర, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడిని అరెస్టు చేయడం పట్ల అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణలోనూ మాత్రమే కాదు, దేశంలోని అన్ని  రాష్ట్రాలూ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో నిరసనలు మిన్నంటాయి.   

చంద్రబాబు అరెస్టును ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా జాతీయ స్థాయిలో  కూడా అన్ని రాజకీయపార్టీలూ తప్పుపట్టాయి.  నేషనల్ మీడియాలో కూడా  చంద్రబాబు అరెస్టు వార్తను అత్యంత ప్రముఖంగా ప్రచురించింది. ప్రసాదం చేసింది. ఇక  మేధావులు కూడా ఈ అరెస్టు వ్యవహారాన్ని కక్ష  సాధింపు చర్యగానే  అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు, కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక , చెన్నై లాంటి  నగరాలలో యువత  చంద్రబాబుకు మద్దతుగా  నిరసనలు చేపట్టారు.   రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు.  అసలు జగన్ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణాలలో చంద్రబాబు అక్రమ అరెస్టు ఒకటి అనడంలో సందేహం లేదు.  

చంద్రబాబు అక్రమ అరెస్టుపై పెల్లుబికి ఆగ్రహ జ్వాలల సెగ అప్పటి జగన్ సర్కార్ కే కాదు.. అప్పట్లో మోడీ సర్కార్ ను కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజేపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నాయకులు  చంద్రబాబు అరెస్టు వల్ల జగన్ మాత్రమే కాదు.. తాము కూడా తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నామని బాహాటంగానే  చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏపీలో వైసీపీ పతనాన్ని ఎన్నికలకు ముందే ఖరారు చేసేసింది.  2024లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ కు ఏపీ జనం గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్షహోదాకు కూడా నోచుకోని ఘోర పరాజయాన్ని చవి చూపించారు.   

By
en-us Political News

  
నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి హాజరు కావడం మాత్రమే కాకుండా ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత వేదికపైకి వెళ్లి కొత్త ముఖ్యమంత్రిని అభినందించడం ప్రస్తుత కాలంలో అత్యంత అరుదనే చెప్పాలి. ఆ ఆరుదైన సంఘటన కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సోమవారం జరిగింది.
విద్యాసంవత్సరం ఆరంభాన్ని ఓ భారీ విద్యాపండుగగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది. ఆ రోజు అంటే రానున్న విద్యాసంవత్సరం మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లోనూ ఏకకాలంలో మూడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అవేంటంటే అదే రోజున తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాలో జమచేయనుంది. అలాగే అదే రోజు అంటే పాఠశాలలె తెరిచిన తొలి రోజునే విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించనుంది. అలాగే అదే రోజు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ నూ నిర్వహించనుంది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుతమైన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న సంగతి విదితమే. అయితే ఆ విజయం తరువాత తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. ఎన్నికలలో పరాజయం పాలైన డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లి మరీ పలకరించి, పరామర్శించిన రజనీకాంత్, ఘన విజయం సాధించిన టీవీకే విజయ్ కు అభినందించలేదు.
అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. 
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణంగా అవకాశం ఉన్నా లేకున్నా టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకునే భూమన.. ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ఎక్కి ప్రయాణించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.