తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహాలక్ష్మి వాడ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఫ్రిడ్జ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో ఉన్న ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న విజయ్ మరియు మరో మహిళ మంటల్లో చిక్కుకున్నారు. వారు గట్టిగా అర్తనాదాలు చేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించారు.
మంటలు తీవ్రంగా వ్యాపిస్తూ దట్టమైన పొగలు బయటకు రావడంతో, స్థానికులు ఇద్దరినీ బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫ్రిడ్జ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-killed-in-fridge-explosion-36-216721.html
మల్లె, కనకాంబరం, రోజా, చామంతి వంటి సుగంధ పుష్పాలతో పాటు తులసి వంటి పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్ప నీరాజనం సమర్పించారు. గంటల తరబడి సాగిన ఈ పుష్పాభిషేకం చూసి భక్తులు పులకించిపోయారు.
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఫ్రంట్‌లైన్ ప్రెస్ పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వీరు ఆదివారం వెళ్లారు.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, మహ్మద్ షమీ అదిరిపోయే వ్యూహంతో వారిని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికే షమీ వేసిన స్లోయర్ డెలివరీని అర్థం చేసుకోవడంలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి షార్ట్ థర్డ్ దిశగా వెళ్లగా, అక్కడ ఉన్న మనిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ పట్టాడు.
మంగళవారం ) పవర్ ప్లాంట్స్‌పై దాడులు, బ్రిడ్జ్‌పై దాడులు అన్నీ కలగలిపి ఉంటాయి. ఇలాంటిది మునుపెన్నడూ చూసి ఉండరు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి అంటూ అని బూతులతో ట్రంప్ చెలరేగిపోయారు.
చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్‌విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.