అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు వారాల గడువు ఇచ్చారు. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇచ్చిన గడువును పొడిగించాలన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు 'ట్రూత్' ద్వారా ట్రంప్ వెల్లడించారు. పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ మునీర్‌తో మాట్లాడాననీ, వారి వినతి మేరకు ఇరాన్‌కు ఇచ్చిన గడువును పొడిగించి, దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే హోర్ముజ్ జలసంధిని తెరవాలనే షరుతుకు లోబడి ఈ రెండు వారాల గడువుకు, కాల్పుల విరమణకు అంగీకరించానని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుందని పేర్కొన్న ట్రంప్.. ఇరాన్ పది సూత్రాలతో పంపిన ప్రతిపాదన బాగుందని చెప్పారు. ఈ రెండు వారాల సమయంలో ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతాయన్నారు.
ఇరాన్‌తో శాశ్వాత ఒప్పందానికి, పశ్చిమాసియాలో ప్రశాంతతను నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయో గపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం త్వరలోనే దొరకబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trump-key-announcement-36-216928.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే