ఫుట్ పాత్‌పై ఆక్రమణల కూల్చివేతలు
Publish Date:Apr 8, 2026
Advertisement
మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మల్కాజిగిరి చౌరస్తాలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు చర్యలను మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. చౌరస్తా ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, తాత్కాలిక షెడ్లు, స్టాళ్లను అధికారులు తొలగిస్తు న్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ చర్యలు కొనసాగుతు న్నాయి. ఆక్రమణల తొలగింపులో భాగంగా జేసీబీలు, మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి ఫుట్ పాత్ పై ఉన్న షాపులను తొలగిస్తున్నారు. ముందుగా ఎటువంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా అధికారులు వచ్చి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “కొద్దిగా సమయం ఇవ్వండి, మేమే మా సామాను తీసేస్తాం” అంటూ వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. అయితే ట్రాఫిక్‌కు అంతరా యం కలగకుండా, పాదచారుల సౌకర్యం కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫుట్ పాత్‌పై వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొని ఉంది. పాదచారుల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం దృష్ట్యా ఫుట్‌పాత్ ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగు తుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. పరిస్థితి ఉదృతంగా మారడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై చిరు వ్యాపారుల సామాన్లన్నీ తీసుకునే వరకు వెయిట్ చేసి అనంతరం కూల్చి వేసే పనులు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/encroachments-on-footpaths-in-malkajgiri-and-demolitions-36-216929.html





