Publish Date:May 12, 2022
పార్టీ కార్యాలయం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నడి బొడ్డున ఏకంగా ఎకరం భూమి కేటాయించింది. మార్కెట్ దార ప్రకారం ఈ భూమి విలువ దాదాపు వంద కోట్లు ఉంటుందని అంచనా.
ఒక వైపు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భూములు అందుబాటులో లేవని చెబుతున్న ప్రభుత్వం సొంత పార్టీ ఆఫీస్ కోసం మాత్రం ప్రైమ్ ఏరియాలో దాదాపు ఎకరం భూమిని కేటాయించడం అధికార కబ్బా తప్ప మరొకటి కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం ప్రభుత్వం నగరంలో అత్యంత లగ్జూరియస్ ఏరియాలలో ఒకటైన బంజారా హిల్స్ లో ఏకంగా 4539 గజాల స్థలాన్ని కేటాయింది. ఈ కేటాయింపుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. దీనికి అధికారిక కబ్జాగా అభివర్ణిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఇలా భూ కబ్జాలకు వినియోగిస్తున్నదని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. దొడ్డిదారి జీవోలతో అత్యంత విలువైన భూమిని పార్టీ కార్యాలయం కోసం కట్టబెట్టడం భూ దొపిడీ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు లేవన్న నిర్ధారణకు రావడం వల్లే తెరాస అధినేత పార్టీకి ఇలా అడ్డగోలుగా విలువైన భూమిని ధారాదత్తం చేశారని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెరాస సర్కార్ అడ్డగోలుగా భూ పందేరానికి తెరలేపిందనీ, పార్టీ వ్యక్తులకు, అస్మదీయులకు ప్రభుత్వ భూమినీ, అసెన్డ్ భూములను కట్టబెడుతోందని విమర్శలు వినవస్తున్నాయి.
వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి రెడ్ ఫోర్డ్ పేరిట కట్టబెట్టిందనీ, రియల్ వ్యాపారం కోసం అసైన్డ్ భూములనూ వదలడంలేదని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నది. మరో వైపు బీజేపీ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం విలువైన భూమిని కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ అక్రమ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-official-land-grab-in-name-of-party-office-25-135774.html
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.