గడప గడపకూ వైసీపీ సర్కార్ కు ఎదురుగాలి.. మంత్రులు ఎమ్మెల్యేలకు నిరసనల సెగ

Publish Date:May 12, 2022

Advertisement

గడప గడపకూ వైసీపీ అంటూ ప్రజల వద్దకు వెళ్లడానికి ఆ పార్టీ నేతలు భయపడ్డారు. అందుకే రాత్రికి రాత్రి గడప గడపకూ వైసీపీ పేరును గడప గడపకూ ప్రభుత్వం అంటూ మార్చేశారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తున్నదంటే నిరసనలు తెలియజేయడానికి జనం భయపడతారనీ, కేసులు ఉంటాయని జంకుతారనీ వైసీపీలోని మేధావి వర్గం వ్యూహం పన్నింది. దానిని అమలు చేసింది. గడప గడపకూ ప్రభుత్వం పేరుతో జనం వద్దకు వెళ్లే కార్యక్రమంలో పార్టీ నేతలే కాకుండా, అధికారులను కూడా భాగం చేసింది. ఇలా అయితే జనం ఎక్కడైనా తిరగబడినా. నిలదీసినా కేసుల ఉంటాయని జనం బయపడతారని జగన్ అంచనా వేశారు. అయితే ఈ వ్యూహం బెడిసి కొట్టింది. వైసీపీ ప్రభుత్వమైనా, పార్టీ అయినా మా కొకటే.. నిరసన నిరసనే అంటూ జనం ఎక్కడికక్కడ తిరగబడ్డారు.  జనంతో పాటు కొన్ని చోట్ల వైసీపీ క్యాడర్ కూడా నిరసనలు తెలియజేసింది. చేసిన పనులకు మూడేళ్లుగా బిల్లులు రాలేదన్న  ఆగ్రహం వారిది.  కేవలం సంక్షేమ పథకాలు అందుకున్న వారిని తాము కరోనా సమయంలో కూడా అప్పులు చేసి మరీ సాయం చేశామని చెప్పి వారిని ఓటు బ్యాంక్‌గా ఉంచుకోవడమే లక్ష్యంగా జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పేరేదైనా జగన్ పార్టీ చేపట్టినది గడప గడపకూ వైసీపీ కార్యక్రమమే. పేరు మార్చి గడప గడపకూ ప్రభుత్వం అన్నంత మాత్రాన కార్యక్రమం రూపు రేఖలు మారిపోవు. నిజానికి గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం అయితే అందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉండకూడదు. కానీ ఇక్కడ మాత్రం వైసీపీ నేతల వెనుక అధికారులూ ఉంటున్నారు.   అయినా ప్రజలు ఎక్కడికక్కడ తన నరసన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల పాటు ముఖం చాటేసి ఇప్పుడెందుకు వస్తున్నారంటూ వైసీపీ నేతలను నిలదీస్తున్నారు.  వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు మంత్రులూ కూడా ప్రజా వ్యతిరేకతను ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా చవి చూస్తున్నారు.  కేవలం నిలదీసి ఊరుకోవడం లేదు. తమ సమస్యలు వినకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ అడ్డుకుంటున్నారు. తిట్ల పురాణం విప్పుతున్నారు. అనంత పురం నుంచి శ్రీకాకుళం వరకూ జగన్ సర్కార్ చేపట్టిన గడప గడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో నిరసనలు భగ్గు మంటున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ నేతలకు ఒకేరకమైన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.   జిల్లా హిందూపురంలోని కోట్నూరులో ప్రజాసమస్యలు పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఎంపీ, ఎమ్మెల్సీపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమస్యలు పరిష్కరించకుండా గడపగడపకూ అంటూ రావడం ఎందుకు అంటూ నడిరోడ్డుపై నిలదీశారు.   ఓవైపు మహిళలు సమస్యలపై ప్రశ్నిస్తుంటే.. ఎంపీ, ఎమ్మెల్సీ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లారు.  ఒక్క హిందూపురంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోటా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. ఆర్థిక మంత్రి బుగ్గన కూడా ప్రజా నిరసన చవి చూశారు. అలాగే చిత్తూరు జిల్లాలో మంత్రి రోజానూ జనం నిలదీశారు.న ఎరక్కపోయి గడప గడపకూ కార్యక్రమం చేపట్టామని వైసీపీ నేతలు లోలోన మధన పడుతున్న పరిస్థితి కనబడుతోంది.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో వైసీపీ పట్ల, జగన్ సర్కార్ పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో తేటతెల్లమైందని పరిశీలకులు చెబుతున్నారు. గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు గడపగడపకూ నిరసన ఎదురైందని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

By
en-us Political News

  
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.