తాలిబన్ మద్దతుదారులకు టీఆర్ఎస్ సపోర్ట్! బీజేపీ జాతీయ నేత సంచలనం..
Publish Date:Aug 20, 2021
Advertisement
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో పోరాటంలో దూకుడు పెంచింది బీజేపీ. కేసీఆర్ టార్గెట్ గా వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు కమలం నేతలు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహిస్తుండగా.. ఈనెల 24 నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. హైదరాబాద్ పాతబస్తిలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలు కాబోతోంది బండి యాత్ర. ఇందుకోసం బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తన పాదయాత్రలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకువెళతానంటున్నారు బండి సంజయ్. బండి సంజయ్ పాదయాత్ర పోస్టర్ ను రిలీజ్ చేసిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడు లేనంతగా కేసీఆర్ సర్కార్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టిస్తోందని మురళీధర్ రావు విమర్శించారు. అసెంబ్లీ నడిచే విధానం, కేటాయించే సమయాలు తగ్గిపోతున్నాయని దీని వలన సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. రాజకీయ అవకాశాలు తగ్గి కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతుందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నా కాని భర్తీ చేయడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని దుస్థితికి రాష్ట్రం దిగజారిందని చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో... ఉద్యమాలపై లాఠీ దెబ్బలు పెరిగాయని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ సహకారం ఉందని... అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని తెలిపారు యువతకు ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయని.. ఓయూలాంటి యూనివర్శిటీల్లో కూడా 80 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మురళీధర్ రావు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా టైమ్ కి రావడం లేదని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ల విషయంలో కూడా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని... 2019 నాటికి 2.70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని... కానీ ఇప్పటి వరకు 30 వేలు మాత్రమే పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో దళితులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాలిబన్ మద్దతుదారులు, రాజకీయ నాయకులు ఉన్నారని... టీఆర్ఎస్ పార్టీతో కలిసి వారు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నాయకులు తాలిబన్లకు సపోర్ట్ చేసేలా ప్రసంగాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆగస్ట్ 10 వరకు ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని తెలిపారు. 2019 వరకు 2లక్షల ఇండ్లు నిర్మాణం కావలసి ఉండగా ఇప్పటి వరకు 30 వేల ఇండ్లు మాత్రమే నిర్మించారని మురళీధర్ రావు చెప్పారు. పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మహబూబ్ నగర్, నల్గొండ లో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అవినీతి అంటే కేసీఆర్ ఫ్యామిలీ అని ఆరోపించారు. మూసినది లో ఉన్న కాలుష్యం లా టీఆరెస్ లో అవినీతి పేరుకుపోయిందని చెప్పారు. మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని చెప్పారు. కేవలం బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ ను ఓడించగలదన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల్లో గొప్ప మార్పును తీసుకువస్తుందని చెప్పారు. బీజేపీ బలోపేతమై తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్నారు.
http://www.teluguone.com/news/content/trs-leaders-support-taliban-fallowers-bjp-leader-hot-comments-39-121784.html





