ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి ప్రధాని ఆహ్వానం: హస్తినకు చంద్రబాబు, పవన్.!
Publish Date:Nov 27, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనకు బయలు దేరారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. పార్లమెంటు సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జరుగుతున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సదస్సు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించకుంది. నవంబరు 30 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతుండటం విశేషం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు గతంలో తగినంత మెజారిటీ లభించక ఆమోదం పొందని నేపథ్యంలో ఈసారి వీటిని ఆమోదింపజేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చించి, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ బిల్లుల్లో సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, సీట్ల సమతుల్యత వంటి అంశాలపై చర్చలు, ఆందోళనలు వినిపిస్తున్న తరుణంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగడం విశేషం. ఈ బిల్లులపై మిత్రపక్షాలకు కేంద్రం ఎలాంటి స్పష్టత ఇస్తుంది, ఏయే అంశాలపై ఏకాభిప్రాయం కుదురుతుందనే దానిపై అందరి దృష్టీ నిలిచింది. రాజ్యాంగ సవరణ అవసరమైన బిల్లుల ఆమోదం నేపథ్యంలో ఎన్డీయే కూటమి పార్టీల అభిప్రాయాలు, అభ్యంతరాలపై సమగ్రంగా చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేందుకే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు, ప్రాంతీయ అంశాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, కూటమి భాగస్వాముల మధ్య జరిగే సంప్రదింపులు కీలకంగా మారాయి. ఇది కూడా చదవండి: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్: వైసీపీ సైలెన్స్.. విభేదాల ప్రచారానికి ఎండకార్డ్.! ఢిల్లీ సమావేశం ముగిసిన తర్వాత ఈ భేటీలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు వెలువడే అవకాశం ఉంది. నవంబరు 30న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే నాటికి డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్ బిల్లుల విషయంలో ఒక స్పష్టత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఎన్డీయే సమావేశంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఏ విధమైన స్పష్టత వస్తుంది, తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ప్రజలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మీకు నచ్చవచ్చు: ప్రొటోకాల్ పక్కన పెట్టి, భద్రతను తోసిరాజని: బాబుతో పవన్ భేటీ: రాజీనామా వదంతులకు ఫుల్ స్టాప్.! పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీకి గైర్హాజరుపై చర్చోపచర్చలు.! [Chandrababu Naidu Pawan Kalyan Delhi Tour, NDAmeeting, PM, Invites, Delimitation,Women Reservation Bills, TeluguOne]
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-pawan-kalyan--delhi-tour-39-238075.html




