ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణపై అక్రమాస్తులు రూ. 400 కోట్లు.!
Publish Date:Jul 23, 2026
Advertisement
ట్రాన్స్కోలో డివిజనల్ ఇంజనీర్ (డీఈ)గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీ లకు చెందిన మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు వెలుగు లోకి వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 27.65 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోగా, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు ఉండోచ్ని అంచనా. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... శేరిలింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో రూ.1.23 కోట్లు విలువ చేసే నాలుగు నివాస ఫ్లాట్లు, అంజనేయ నగర్లో 160 చదరపు గజాల స్థలంలో నిర్మించిన రూ. 1.82 కోట్లు విలువ చేసే జీ+3 వాణిజ్య భవనం, గుత్తాల బేగంపేట్లో 250 చదరపు గజాల స్థలంలో 2.90 కోట్ల రూపాయలు విలువ చేసే జీ+5 కమర్షియల్ భవనం ఉన్నాయి. అలాగే ముత్యం వెంకట రమణ భార్య పేరుతో నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబ డులు పెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది. కూకట్పల్లి మూసాపేట అంజనేయన గర్లో పది అపార్ట్మెంట్లు నిర్మించి నట్లు గుర్తించగా, వాటిపై సుమారు 20 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశ ముందని పేర్కొన్నారు. సోదాల్లో రూ. 52.02 లక్షల బ్యాంకు నిల్వలు, 2 వేల 94 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కార్లు, 30 లక్షల విలువైన గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 20 మద్యం సీసాలు, వీటిలో 19 విదేశీ, ఒక ఐఎంఎఫ్ఎల్ లభించగా, దీనిపై మదాపూర్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కేసు నమోదు చేసింది. ఏసీబీ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల అధికారిక విలువ సుమారు రూ.27.65 కోట్లుగా ఉన్నప్పటికీ, మార్కెట్ విలువ ప్రకారం 400 కోట్ల వరకు అక్రమాస్తులు ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా పలు ఆస్తులపై విచారణ కొనసాగు తోంది. ఇలా ఉండగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. Transco DE Muthyam Venkataramana, Illegal assets, 400 crores, ACB raids, Arrest, Judicial, Remand
http://www.teluguone.com/news/content/transco-de-muthyam-venkataramana-amassed-illegal-assets-worth-rs-400-crore-36-226851.html





