నేను ఎక్కడికీ పారిపోలేదు.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా : ఉదయ్ కృష్ణారెడ్డి

Publish Date:Jul 28, 2026

Advertisement

 

నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్న ట్రైనీ ఐపీఎస్..!

ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదుతో నమో దైన కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టు కున్న నగర పోలీస్ కమిషనర్, ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేశారు. డీసీపీ లావణ్య నేతృత్వంలోని ప్రత్యేక బృందం అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే బాధిత ట్రైనీ ఐపీఎస్ అధికారిణి నుంచి జాతీయ పోలీస్ అకాడమీలో సుమారు ఆరు గంటల పాటు డీసీపీ లావణ్య స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. 

ఈ సందర్భంగా తనపై జరిగినట్లు చెబుతున్న లైంగిక వేధింపులు, మానసిక, శారీరక చిత్రహింసలకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, తన వద్ద ఉన్న ఆధారాలను కూడా విచారణ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. అధికారిణి ఇచ్చిన స్టేట్‌మెంట్, సమర్పించిన ఆధారాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.బాధిత అధికారిణి వాంగ్మూలం ఆధారంగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించేందుకు అత్తాపూర్ పోలీసులు పలుమార్లు ప్రయత్నించారు. 

అయితే గత నాలుగు రోజులుగా ఆయన పోలీసులకు అందుబాటులోకి రాక పోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఊహించని విధంగా నేడు ఉదయ్ కృష్ణారెడ్డి ఒక మీడియా ఛానల్ కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థపై, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని నేను ఎక్కడికీ పారిపోలేదు..మా నానమ్మ అనారోగ్యంతో ఉన్నందుకు స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చాని తెలిపారు. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా..నా శాశ్వత చిరునామా ఊళ్లపాలెంకు ఎటువంటి నోటీసులు రాలేదని ఆయన వెల్లడించారు. సాయంత్రంలోగా పోలీసుల ఎదుట హాజరై తన స్టేట్‌మెంట్ ఇస్తానని స్పష్టం చేశారు. 

విచారణ కు పూర్తిగా సహకరిస్తానని కూడా తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల ఎదుట హాజరైన తర్వాత డీసీపీ లావణ్య నేతృ త్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. బాధిత అధికారిణి ఇచ్చిన వాంగ్మూలం, అందించిన ఆధారాలు, ఇతర సాంకేతిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పలు కీలక ప్రశ్నలు సంధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బాధిత అధికా రిణి వాంగ్మూలం నమోదు కావడం, కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేయడం, ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి విచార ణకు హాజరవుతానని ప్రకటించడం వంటి పరిణామాలతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. నేటి విచారణ అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Trainee IPS Uday Krishna Reddy, SIT,  harassment case, Attapur Police, oollapalem villeage, DCP Lavanya, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand
 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో
ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎదురవుతున్న చిక్కులను తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పాలమూరు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతొ ఆ ప్రాజెక్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మెట్రో ప్రయాణం ఒక హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి, సరాసరి మెట్రో స్టేషన్‌కు చేరుకుని సాధారణ ప్రయాణీకుడిలా క్యూ లైన్‌లో నిలబడి టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణికుల మధ్య కూర్చుని పక్కన ఉన్న వారితో ముచ్చటించారు.
జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో ఏడాదంతా సాగునీటికి కొదవ ఉండదని రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వరద తాకిడికి పలు గ్రామాలు ముంపునకు గురికావడం, రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికాలోని ఎంపోరియాలో 1,000 ఎకరాల డేటా సెంటర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్‌లో చప్పట్లు కొట్టినందుకు లక్స్ క్లారిడ్జ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగ హక్కులు, 1 గిగావాట్ విద్యుత్ వివాదం మరియు ఈ సంచలన ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇక్కడ చదవండి!
గూగుల్ పేలోకి Gemini AI సాంకేతికతతో Ask Google Pay ఫీచర్ వచ్చింది. మీ ఖర్చులు, పొదుపు మార్గాలు మరియు CIBIL స్కోర్ వివరాలను 10 భారతీయ భాషల్లో సులభంగా తెలుసుకునే విధానం గురించి పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
AIG ఉమెన్స్ ఓపెన్ 2026 ప్రత్యక్ష ప్రసారాలు, నెల్లీ కోర్డా గ్రాండ్ స్లామ్ వేట, మియు యమషిత డిఫెండింగ్ రికార్డులు మరియు మ్యాచ్ సమయాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, ప్రత్యేక సెలవులో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసే శిక్షణలో చేరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది.
కాకినాడ జిల్లాకు చెందిన దర్జీ కుమారుడు మాల్తి అఖిలేశ్ సంచలన విజయం సాధించాడు. కెనడా ఏఐ సంస్థలో ఏడాదికి రూ. 1.06 కోట్ల ప్యాకేజీతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పొందిన స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ చదవండి.
బెంగళూరులో రూ.2.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను ఐటీ ఉద్యోగులు ఎలా కొనుగోలు చేస్తున్నారు రెడ్డిట్ వేదికగా వైరల్ అవుతున్న ఆసక్తికర వివరాలు, టెక్కీల అసలు సీక్రెట్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 9,275 కోట్ల మెగా ఐపీఓ పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రైస్ బ్యాండ్, లేటెస్ట్ జిఎమ్‌పి GMP , సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, అలకేషన్ తేదీలు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలు ఇక్కడ క్లియర్ గా చదవండి.
22వ కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఇంగ్లాండ్‌పై అద్భుత విజయాలు, మానవ్ ఠక్కర్ వీరోచిత పోరాటం, శ్రీజ అకుల థ్రిల్లింగ్ ప్రదర్శనతో భారత్ మలేషియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ ఆడటంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ భవిష్యత్తు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని, గిల్ ముందుకు వచ్చి మద్దతు ఇస్తేనే హిట్‌మ్యాన్ వరల్డ్ కప్ ఆడగలడని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.