కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్.. ఒక వివాదంతో హీరో టు జీరో..!
Publish Date:Jul 20, 2026
Advertisement
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి సస్పెండ్..! లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణా రెడ్డిపై నేషనల్ పోలీస్ అకాడమీ చర్యలు చేపట్టింది. మహిళా ఐపీఎస్ అధికారి చేసిన ఫిర్యాదు మేరకు ప్రివిలేజ్ కమిటీ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. విచారణ అనంతరం ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు కమిటీ నిర్ధారించడంతో, ఉదయ్ కృష్ణా రెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా, ఆయనను నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి రిలీవ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఉదయ్ కృష్ణా రెడ్డి సర్వీస్‌లో తుది జాయినింగ్‌పై నిర్ణయం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) తీసుకుంటుందని నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు తెలిపారు. ఒకప్పుడు ఆయన పేరు పట్టుదలకు ప్రతీక. కూరగాయలు అమ్ముతూ చిన్ననాటి కష్టాలను ఎదుర్కొన్న యువకుడు... కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి, ఆ ఉద్యోగాన్నే వదిలి ఐదో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించి ఐపీఎస్‌గా ఎంపికై ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. కానీ ఇప్పుడు అదే ఉదయ్ కృష్ణారెడ్డి పేరు తీవ్ర వివాదాలు, క్రిమినల్ కేసు, సస్పెన్షన్, ఆత్మహత్యాయత్నం వంటి పరిణామాలతో వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న సమయంలో సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపడం, వేధించడం, వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేయడం, బలవంతంగా మొబైల్ ఫోన్ తీసుకుని వ్యక్తిగత సమాచారం పరిశీలించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, తనను గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి బెదిరించడం, గొంతు పిసకడం, కత్తితో బెదిరించడం, వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి భర్తకు పంపిస్తానని బెదిరించినట్లు కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు మరియు న్యాయ ప్రక్రియలో ఉండగా, కోర్టులో ఇంకా నిరూపించాల్సి ఉంది. ఫిర్యాదు అనంతరం ఎన్పీఏ అంతర్గత ప్రివిలేజ్ కమిటీ కూడా విచారణ చేపట్టింది. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించి ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అలాగే అకాడమీ నుంచి పంపిస్తూ తదుపరి సర్వీస్‌లో చేరికపై తుది నిర్ణయం సంబంధిత అధికారులదేనని తెలిపింది. ఈ పరిణామాల మధ్య మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన కేసు నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో విషపూరిత ద్రవం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆయనతో ఉన్న స్నేహితురాలు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ వద్ద పెరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచారు. ఉదయ్ కృష్ణా రెడ్డి చిన్న వయసులోనే జీవితంలోని అతిపెద్ద కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి మరణించగా, 15 ఏళ్ల వయసులో తండ్రిని కూడా కోల్పోయారు. తల్లిదండ్రులిద్దరూ లేకపోవడంతో ఆయనను నాన్నమ్మ కూలి పనులు చేస్తూ పెంచి చదివించింది. ఆర్థిక ఇబ్బందుల మధ్య చదువును కొనసాగించిన ఆయన, జీవనోపాధి కోసం కొంతకాలం ల్యాబ్ టెక్నీషియన్‌గా కూడా పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కృషి చేసిన ఉదయ్ కృష్ణా రెడ్డి 2012లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. విధులు నిర్వహిస్తూ ఉన్నత లక్ష్యాలను వదలకుండా చదువును కొనసాగించారు. 2018లో ఒక సీఐ తనను అవమానించిన ఘటన ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది. ఆ సంఘటన తర్వాత ఎలాగైనా సరే సివిల్స్ సాధించి ఉన్నతాధికారి కావాలనే సంకల్పంతో యూపీఎస్సీ సివిల్స్‌కు సిద్ధమయ్యారు. సివిల్స్ ప్రయాణం ఆయనకు అంత సులభంగా సాగలేదు. 2019, 2021, 2022 సంవత్సరాల్లో స్వల్ప మార్కుల తేడాతో సివిల్ సర్వీసెస్‌లో అవకాశం చేజారిపోయింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో ప్రయత్నించారు. చివరకు 2024లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ఆయన విజయం అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఐపీఎస్‌గా ఎంపికైన అనంతరం జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రివిలేజ్ కమిటీ విచారణ అనంతరం తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. Trainee IPS Uday Krishna Reddy, IPS Suicide Attempt Hyderabad, Telangana Police News, SR Nagar Hospital IPS, Telugu News Live, Prakasam District, Singarayakonda, NPA
http://www.teluguone.com/news/content/trainee-ips-uday-krishna-reddy-36-226513.html





