లొంగిపోయిన మావోయిస్టులతో టూరిజం ప్రచారం
Publish Date:Apr 28, 2026
Advertisement
ములుగు అడవి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఒకప్పుడు అరణ్య ప్రాంతాల్లో సాయుధ పోరాటం చేసిన మాజీ మావోయిస్టులను ఇప్పుడు టూరిస్ట్ గైడ్లుగా మారుస్తూ వారికి ఉపాధి కల్పిస్తు న్నారు. ములుగు జిల్లా అడవుల్లో ఉన్న కర్రెగుట్టలు, అరణ్య సౌందర్యం, గిరిజన సంస్కృతి వంటి ప్రత్యేకత లను ప్రపంచానికి పరి చయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. లొంగిపోయిన మావోయిస్టులకు “గిరిదర్శక్” పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొత్త జీవితం వైపు నడిపిస్తు న్నారు. పోలీసులు, టూరిజం శాఖలు కలిసి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. టూరిస్టులతో ఎలా మాట్లాడాలి, అడవి ప్రాంతాల భద్రత, మార్గద ర్శకత్వం, స్థానిక చరిత్ర – సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. శిక్షణ పూర్త య్యాక వీరిని అధికారికంగా టూరిజం గైడ్లుగా నియమించారు. ఇకపై ఈ మాజీ మావోయిస్టులు ములుగు జిల్లా అడవులు, కర్రెగుట్టలు, అలాగే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో టూరిస్టులకు మార్గదర్శకులుగా పనిచేయనున్నారు. అడవి మార్గాలపై వీరికి ఉన్న పరిజ్ఞానం టూరిస్టులకు ఎంతో ఉపయోగపడు తుందని అధికారులు చెబుతున్నారు. ఈ చర్యతో రెండు ప్రయోజనాలు సాధ్యమవుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఒకవైపు లొంగిపోయిన మావోయిస్టులకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుండగా, మరోవైపు అడవి టూరిజం అభివృద్ధికి దోహదం అవుతోంది. ఈ కార్యక్రమం ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/tourism-campaign-with-surrendered-maoists-36-218473.html





