బ‌డ్జెట్ బెల్‌.. ఆనం ఆగం.. తాడిప‌త్రి వార్‌.. ఉండ‌'వ‌ర్రీ'.. టాప్‌న్యూస్ @7pm

Publish Date:Feb 18, 2022

Advertisement

1. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వొద్దు అన్నందుకు వివేకానందరెడ్డిపై కక్షగట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పరిటాల రవి హంతకులను ఒక్కొక్కర్ని చంపేశారని చెప్పారు. సీఎం జగన్.. నేరాలు, ఘోరాలు చేస్తూ హత్యా రాజకీయాలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. బాబాయిని చంపి టీడీపీ మీద విమర్శలు చేశారని మండిప‌డ్డారు చంద్ర‌బాబు. 

2. బడ్జెట్ సమావేశాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయ‌ని తెలుస్తోంది. 8 లేదా 14వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో సమావేశాలకు సంబంధించి ప్రకటన వెలువడనుంద‌ని స‌మాచారం. 

3. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల ఇన్‌చార్జ్‌లతో టీడీపీ అధినేత‌ చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గాల్లోని పరిస్థితులపై చర్చించారు. అయితే, ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశానికి డుమ్మా కొట్టారు. ముందుగానే సమావేశానికి రాలేనని గంటా సమాచారం ఇచ్చారని టీడీపీ నేతలు తెలిపారు. 

4. జిల్లాల విభ‌జ‌న‌ విషయంలో హడావుడి నిర్ణయాలు తీసుకుంటే విధ్వేషాలు పెరుగుతాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం, సాగర్ దగ్గర తెలంగాణ, ఆంధ్రా పోలీసులు కొట్టుకున్నట్టు అవుతుందన్నారు. జిల్లా విభజన సమయంలో నీటి లెక్కలు తేల్చాలని కోరారు. జిల్లాల‌ విభజన ప్రక్రియ గందరగోళంగా ఉందని ఆనం విమర్శించారు. 

5. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. మున్సిపల్ పాలక వర్గం అనుమతి తీసుకోకుండా విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి సిద్దపడడం దుమారం రేపింది. విగ్రహ ఏర్పాటును జేసీ వర్గం అడ్డుకుని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య మ‌రోసారి రాజకీయ వేడి రాజుకుంది.

6. ఏపీకి త్వ‌ర‌లోనే రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మరే ఇతర జోన్ ఇచ్చే ఉద్దేశం రైల్వేకు లేకపోయినా.. ప్రధాని మోదీ ఏపీకు రైల్వే జోన్ ఇస్తున్నారన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు రాష్ట్రం స్టిక్కర్లు వేసుకుంటోందని విమర్శించారు. పీఎం అవాస్ యోజన కింద నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్బికేలు, సచివాలయాలు.. కేంద్రం ఇచ్చే నిధులతోనే జరుగుతున్నాయన్నారు.

7. ఏపీ విభజనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కోపమెందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కేసీఆర్ మాట్లాడాలని, బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలని అన్నారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీలతో చర్చ పెట్టించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం జగన్ నోరుమెదపకపోవటం అన్యాయమని ఉండవల్లి మండిపడ్డారు. 

8. కేంద్రం కన్నెర్ర చేస్తే జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు టీడీపీ నేత బండారు. వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్, విజయసాయి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైసీపీ-బీజేపీ మధ్య లోపాయకారి పొత్తు ఉంద‌ని ఆరోపించారు. ఏపీ గవర్నర్ రబ్బర్ స్టాంప్‌గా మారారని మండిప‌డ్డారు. 

9. ఏపీలో రైస్ స్కాండల్‌పై సీబీఐ దర్యాప్తు జ‌ర‌గాల‌ని బీజేపీ నేత లంకా దినకర్ డిమాండ్ చేశారు. మార్కెట్‌లో కిలో రూ.40 అమ్మే బియ్యాన్ని రూ.25కే ఎగుమతి చేయడం ఏంట‌ని ప్ర‌శ్నించారు. గత మూడేళ్లుగా కోట్ల విలువైన పేదల బియ్యాన్ని స్వాహా చేసిన వారెవరో బయటపడాలన్నారు. 

10. త‌మ‌కు ప్రతిపక్షాలు, స్వపక్షాలు, ప్రభుత్వాలు అనే భేదాలు ఉండవ‌న్నారు చిన‌జీయ‌ర్ స్వామి. దేవుడికి పూజ, యాగం వంటివి జరిగే చోట ఎలాంటి ఆహ్వానం అక్కర్లేదన్నారు. సీఎం కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఆరోగ్యం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల వ‌ల్ల ఆయన రాలేకపోయి ఉంటారని చెప్పారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.