రోజాకు సెగ‌.. వివేకా కాక‌.. వైసీపీలో జిల్లాల గోల‌.. టాప్‌న్యూస్ @7pm

Publish Date:Feb 16, 2022

Advertisement

1. నగరిలో ఎమ్మెల్యే రోజాకు నిర‌స‌న సెగ త‌గిలింది. నియోజ‌క‌వ‌ర్గంలో ‘మీతో మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఆమెను ప్రజలు నిలదీశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ పథకంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో నిర్మించుకున్న ప్రభుత్వ ఇంటికి ఎందుకు పదివేలు చెల్లించాలని ప్రశ్నించారు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

2. దస్తగిరి మాత్రమే వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని హైకోర్టు తెలిపింది. వివేకా హత్య కేసులో వివేకా డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్నిసవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేవేసింది. దస్తగిరి వ్యవహారంపై కడప కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 

3. ఏపీ జైళ్లశాఖ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. కడప జైల్లో ఉన్న వివేకా హత్యకేసు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని లేఖలో కోరారు. జైల్లో ఉన్న జైల్లో ఉన్నవారి ప్రాణాలకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉందని భావించాల్సి ఉంటుందన్నారు.  

4. శ్రీకాకుళంలో మోటర్లకు మీటర్లు ఎందుకు పెట్టారని కేంద్రాన్ని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే కేంద్రం రాయితీలు ఇస్తామంటోందని మండిప‌డ్డారు. ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని హ‌రీశ్‌రావు ఆరోపించారు.

5. యూపీ ఎన్నికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. యోగీ ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే, మీరు యూపీలో ఉంటారో.. రాష్ట్రం విడిచి పారిపోతారో తేల్చుకోండని రాజాసింగ్‌ హెచ్చరించ‌డంపై ఈసీ ఇలా నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌కు సూచించింది ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌. 

6. మోకాళ్ల‌ మీద నడిచినా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదని ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ జోస్యం చెప్పారు. తన పని అయిపోయిన  కారణంగానే కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకుంటున్నారని అన్నారు. తన కుట్ర‌లు, కుతంత్రాల పరిజ్ఞానం సరిపోనందునే కేసీఆర్.. పీకే సాయం తీసుకుంటున్నారని.. ప్రధాని మోదీపై కేసీఆర్ పదజాలాన్ని ప్రజలు చీ కొడుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. 

7. కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా విభ‌జ‌న‌లో వెంక‌ట‌గిరికి అన్యాయం జ‌రిగింద‌న్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి. డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారని, మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా లేరన్నారు. శాస్త్రబద్ధంగా నీళ్లు, నిధుల గురించి చట్టపరంగా ఆలోచించి.. జిల్లాల విభజన చేస్తే బాగుండేదన్నారు ఆనం. 

8. తప్పు సీఎం చేస్తే.. వేటు డీజీపీపై పడిందని.. పీఆర్సీ ఉద్యమంతోనే డీజీపీపై వేటు వేశారని సీపీఐ రామకృష్ణ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మరోసారి సీఎం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. జేఏసీ చైర్మన్లకు సీఎం జగన్ చెడ్డపేరు తెచ్చారన్నారు. ప్రత్యేక హోదా కాలం చెల్లిందని జీవీఎల్ అంటున్నార‌ని.. స్పెష‌ల్ స్టేట‌స్‌పై మలిదశ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 

9. పోలీసుల నుంచి త‌న త‌మ్ముడు జగత్ విఖ్యాత్‌కు ప్రాణహాని ఉందని మాజీ మంత్రి, టీడీపీ నేత‌ భూమా అఖిల ప్రియ ఆరోపించారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో బస్‌షెల్టర్‌ కూల్చి వేత‌పై ప్రశ్నించినందుకు తన తమ్ముడిపై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. ఆళ్ల‌గడ్డలో అభివృద్ధి పేరట అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు భూమా అఖిల‌ప్రియ‌. 

10. జడ్జిలను దూషించిన కేసులో ముగ్గురిని కస్టడీకి తీసుకునేందుకు సీబీఐకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న న్యాయవాది కళానిధి గోపాల కృష్ణ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. విచారణకు ఆరోగ్యం సహకరించదని వైద్యులు చెబుతూ కళానిధిని డిశ్చార్జ్ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆయ‌న్ను సీబీఐ క‌స్ట‌డీకి తీసుకోవ‌డం ఆల‌స్యం అవుతోంది. 
 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.