ట్రంప్ సొంత మీడియా షురూ.. ‘ట్రూత్ సోషల్’లో తొలి పోస్ట్..
Publish Date:Feb 16, 2022
Advertisement
అగ్రరాజ్యం అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ మార్చి నెల నుంచి మన ముందుకు వస్తోంది. ట్రూత్ సోషల్ వేదికపై తొలి సందేశం స్క్రీన్ షాట్ ను ఆయన కొడుకు ట్రంప్ జూనియర్ తన ట్విట్టర్ హ్యాండిల్ లోషేర్ చేశారు. ‘గెట్ రెడీ.. మీకు ఇష్టమైన ప్రెసిడెంట్ మిమ్మల్ని త్వరలో కలవబోతున్నారు’ అంటూ ట్రంప్ జూనియర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది ప్రీ ఆర్డర్ పై అందుబాటులో ఉంది. గత అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ భవనంపై దాడిచేశారు. వారిని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఉసిగొల్పారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్ ను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లు సంవత్సర కాలం పాటు నిషేధించాయి. దీంతో తాను సొంతంగా ట్రూత్ సోషల్ అనే ప్లాట్ ఫాంను అభివృద్ధి చేయించారు. ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ట్రంప్ మీడియాటెక్నాలజీ కంపెనీ ఈ ప్లాట్ ఫాంను అభివృద్ధి చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన కొత్త ప్లాట్ ఫాం ఇంచుమించు ట్విట్టర్ ను పోలి ఉంది. ప్రజలను, ట్రెండింగ్ అంశాలను ఫాలో అవడానికి ట్రూత్ సోషల్ లో అవకాశం ఉంది. ఈ ప్లాట్ ఫాంలోని పోస్టులను ట్రూత్స్ అంటారు. ఈ సైట్ లో ట్రంప్ ఫిబ్రవరి 10న చేరారు. ఇప్పటికే 175 మంది ఫాలోవర్లు ఉన్నారు. అందరికీ గొంతునివ్వడం కోసం ట్రూత్ సోషల్ ప్లాట్ ఫాంను అభివృద్ధి చేసినట్లు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రిలీజ్ చేసిన ప్రకటనలో డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/first-post-from-us-ex-presidents-‘truth-social’-39-131894.html





