ఓటీఎస్ వర్రీ.. ఎర్రవల్లిలో రచ్చ.. అలా వాయిదా.. టాప్ న్యూస్@1PM

Publish Date:Dec 27, 2021

Advertisement

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వ‌ర్ణం సాధించిన బాలిక‌ను టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ అభినందించారు. ‘‘అంత‌ర్జాతీయ ప‌వ‌ర్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వ‌ర్ణం సాధించావు సాధియా శెహ‌భాష్‌’’ అంటూ ప్రసంసించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్రకటనను విడుదల చేశారు. బంగారు పతకాన్ని సాధించి మంగ‌ళ‌గిరి ఖ్యాతిని అంత‌ర్జాయ‌తీ స్థాయికి తీసుకెళ్లిన సాధియాని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాన‌ని చెప్పారు. 
-----
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లను రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేయించి ఇస్తామని... ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు.  ఓటీయస్ బాధితులు ఆందోళన చెందవద్దన్నారు. అధికారులకు, వాలంటీర్లకు, స్థానిక వైసీపీ నేతలకు ఓటీయస్ బాధితులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు
-----
పెదకాకాని మండలం నంబూరులో వరి రైతుల నిరసన ర్యాలీ జరిగింది. రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం పోసి ధర్నాకు దిగారు. రైతుల పండించిన వరి ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
------
కర్నూలు జిల్లా అధికారులు, ప్రజలను ఓ వాలంటీర్ హడలెత్తించాడు. కౌతాళం మండలం, తోవి గ్రామంలో కోవిడ్ లక్షణాలు, జ్వరంపై వాలంటీరు రామాంజనేయులు సర్వే చేశాడు. 80 మందికి ఒమైక్రాన్ లక్షణాలు ఉన్నాయని మొబైల్ యాప్‌లో అప్ లోడ్ చేశాడు.  యాప్‌లో వివరాలు చూసిన అధికారులు, వైద్య సిబ్బంది తోవి గ్రామానికి పరుగులు పెట్టారు. గ్రామంలో ఎవరికీ ఒమైక్రాన్ లక్షణాలు లేకున్నా యాప్‌లో తప్పుగా నమోదు చేసినట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. 
----
ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎర్రవల్లికి వెళ్లి తీరుతానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ దొంగతనం బయటపడుతుందనే తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో వరి ఎలా పెట్టారని ప్రశ్నించారు. ఎర్రవల్లి గ్రామం ఏమన్నా నిషేధిత ప్రాంతమా అని నిలదీశారు. ఎందుకు తమను రచ్చబండ నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్ముకై వడ్ల అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 
------
తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగాలు ఇవ్వ‌కుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరుకు నిర‌స‌న‌గా హైద‌రాబాద్‌లోని బీజేపీ కార్యాల‌యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ ‘నిరుద్యోగ దీక్ష’కు దిగారు. మొద‌ట ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేప‌ట్టాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు పార్టీ కార్యాల‌యంలోనే ఆయ‌న దీక్ష‌కు దిగారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న డిమాండ్ చేశారు.
---
సర్వదర్శనం టోకెన్లు హాట్ కేకులా బుక్ అయ్యాయి. సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. జనవరి మాసానికి సంబంధించి ఆన్‌లైన్‌లో రెండు లక్షల 60 వేల టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. టోకెన్లు విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే 2లక్షల 60 వేల టోకెన్లను భక్తులు బుక్ చేసుకున్నారు. టోకెన్ల బుకింగ్ పూర్తయిన విషయం తెలియక ఇంకా టీటీడీ వెబ్ సైట్‌లోకి వేలాది మంది భక్తులు లాగిన్ అవుతున్నారు
------
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్  శీతాకాల విడిది పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ప్రతి ఏడాది సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 3వరకు ఆయన రావల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసు పెరుగుతుండటం, కొత్తగా ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డట్టు సమాచారం.
---
రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒమైక్రాన్‌ కేసుల  సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలను కట్టడి చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హోటళ్లు, మాల్స్‌, బార్‌-రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో రెండు డోసుల వాక్సిన్‌ వేయించుకున్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు
------
పన్నులు ఎగవేసి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన సమాజ్ వాదీ పార్టీ నేత, కాన్పూర్ కు చెందిన పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్ టీ ఇంటెలిజెన్స్  అరెస్ట్ చేసింది. 50 అధికారుల బృందం గత శుక్రవారం నుంచి పీయూష్ జైన్, ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తం రూ.288 కోట్ల కరెన్సీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  
--
 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.