కేసీఆర్ ను కలిసిన జగన్.. అమరావతికి బీజేపీ సంపూర్ణ మద్దతు.. కూన అరెస్ట్.. టాప్ న్యూస్@1PM

Publish Date:Nov 21, 2021

Advertisement

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ లో జరిగిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. అక్కడే ఇద్దరు ముఖ్యమంత్రులు కాసేపు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తర్వాత జగన్, కేసీఆర్ ఇప్పుడు కలుసుకోవలం చర్చగా మారింది. 
-----
రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ పాదయాత్రకు.. ముఖ్యంగా అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు సంపూర్ణ మద్దతు పలికింది.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ నేతలు పురందేశ్వరి, సత్యకుమార్, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఈ సందర్బంగా సోము వీర్రాజు స్పష్టం చేశారు. 
--
రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. రైతులపై దాడులు సరికాదని.. ఈ చర్యలను అందరూ ఖండించాలన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని చెప్పారు. బీజేపీ సహకరించడం లేదనే మాటలు అవాస్తవమని తెలిపారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడా మడమ తిప్పలేదని, కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతుందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.
------
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది చనిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బాధితులకు కనీసం ఆహారం, త్రాగునీరు ఇచ్చే దిక్కు కూడా లేదన్నారు. సీఎం జగన్  గాల్లో ఒక రౌండ్ కొట్టొచ్చి కక్ష సాధింపు చర్యల్లో బిజీ అయిపోయారన్నారు. అర్థరాత్రి యుద్ధ వాతావరణం సృష్టించి టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్‌ని అరెస్ట్ చెయ్యడంపై పెట్టిన శ్రద్ధ వాతావరణ శాఖ హెచ్చరికలో లేదన్నారు. ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేదికాదని అన్నారు.
---------
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‎ను పోలీసులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. టూటౌన్ సీఐ ప్రసాదరావు పట్ల దుర్భాషలాడారంటూ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టి రవిని అరెస్ట్ చేశారు. అనంతరం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‎కు తరలించారు. అర్ధరాత్రి, అది కూడా తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేయడమేంటి..? అని పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు, జిల్లా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-----------
అర్థరాత్రి తలుపులు పగలగొట్టి కూన రవికుమార్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మహిళల్ని కించపరిచే హక్కు వైసీపీకి ఉంటే.. వాటిపై నిరసన తెలిపే హక్కు టీడీపీకి ఉందన్నారు. రవికుమార్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కావాలనే జగన్ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని విమర్శించారు.రదలతో  ప్రజలు ప్రాణాలు పోతుంటే దానిపై దృష్టి పెట్టకుండా టీడీపీ నేతల్ని ఎలా అరెస్టు చేయాలని సీఎం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. 
---------
రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమని నారా రోహిత్ అన్నారు. నారా వారిపల్లెలో పూర్వీకుల సమాధుల దగ్గర.. నిరసన చేపట్టారు. పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదని, క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరని అన్నారు. మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, నారా రోహిత్ అన్నారు
------
మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు సతీమణి నారా భువ నేశ్వరిని నిండు సభలో వైసీపీ నేతలు అవమానించడం సిగ్గుచేటని మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ విమర్శించారు. మహిళలను గౌరవించలేని వైసీపీ తీరు నచ్చక ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.గత ఎన్నికల్లో తాను, తన భర్త రెడ్డెప్ప వైసీపీ విజయానికి కృషి చేశామని అయితే, అధికార పార్టీలో ప్రజాస్వామ్యం అభాసుపాలవుతుండటం చూసి  జీర్ణించుకోలేక తాము వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
---
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియా మీట్‎లో ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం టీఆర్ఎస్ పాలనలో 7,500 మంది రైతులు మృతి చెందారని, బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని ప్రశ్నించారు. 
---
రైతుల పోరాట ఫలితంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగొచ్చి, మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తామని చెప్పడంతో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకి కొత్త ఉత్సాహం వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ల రద్దు కోసం పార్లమెంటులో పట్టుబట్టాలని యోచిస్తోంది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల కోసం బీజేపీ, ముస్లిం ఓట్ల కోసం టీఎంసీ వీటిని బాగా ఉపయోగించుకుంది.
----
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనా వ్యాపార సంస్థలకు గట్టి మద్దతు ప్రకటించారు. తన ప్రభుత్వం చైనా పెట్టుబడిదారులకే పెద్ద పీట వేస్తుందని చెప్పారు. ఇస్లామాబాద్‌లోని ఛాలెంజ్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన చెన్ యాన్ నేతృత్వంలోని చైనీస్ బిజినెస్ ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా ఈ భరోసా ఇచ్చారు. పాకిస్థాన్, చైనాలు గతం, వర్తమానంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఉంటాయన్నారు

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.