సోము వీర్రాజుకు ఉద్వాసన? కొత్త అధ్యక్షుడు ఎవరంటే ..

Publish Date:Nov 21, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ, బలమెంతో,మొన్నటి స్థానిక ఎన్నికల్లో మరో మారు రుజువైంది. కేంద్ర నాయకత్వం ఎంత బూస్ట్ ఇచ్చినా, ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి, పార్టీ వ్యూహ కర్త అమిత్ షా దిశా నిర్దేశం చేసినా, ఫలితం మాత్రం శూన్యం. మిత్ర పక్షం  జనసేన కొన్ని జిల్లాల్లో అయినా కొంతవరకు ఉనికిని చాటుకుంది కానీ, కమల దళం మాత్రం ఏ జిల్లాలోనూ  ఉన్నాను అనిపించుకోలేదు. ఇదలా ఉంటే, అమిత్ షా పర్యటన తర్వాత పార్టీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు. 

ఏపీ బీజేపీలో ఒక వర్గం పక్కాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్డంవుతుంటే, మొదటి నుంచి వైసీపీతో స్నేహ సంబంధాలను కొనసాగిస్త్నున్న మరో వర్గం మాత్రంప ఆద్రిలోనే నడుస్తోంది. ప్రతిపక్షాన్ని విమర్శించడం వలన ప్రయోజనం లేదని రుజువైనా ఇంకా తెలుగు దేశం, చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని, ఫలితంలేని పంథాలో ముందుకు సాగుతోంది కాగా, అమిత్ షా ఆదేశాల మేరకు, ఈ రోజు (నవంబర్ 21) రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకువి జయవాడ నుంచి నెల్లూరుకి పార్టీ నేతలు, కార్యకర్తలు బయలు దేరారు.అయితే, పార్టీ రాష్ట్ర శాఖ  అధ్యక్షుడు సోము వీర్రాజు, మరో ముఖ్య నేత విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం లేదు. బీజేపీ రాజ్య సభ సభ్యులు సుజనా చౌదరి, సి.ఎం.రమేశ్‌, పార్టీ మాజే అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకురాలు  పురందేశ్వరి నెల్లూరులో పాదయాత్రలో  పాల్గొంటున్నారు. 

అమిత్ షా రాజధాని రైతుల మహా పాదయాత్ర పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటుగా, పార్టీ నాయకులు, కర్యకర్తలు పాదయాత్రలో తప్పక పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, సోము వీర్రాజు,ఇతర ముఖ్యనాయకులు, ముఖ్యంగా వైసీపీ అనుకూల వర్గంగా ముద్రపడిన నాయకుల పాదయాత్రలో ఎందుకు పాల్గొనక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.ఎందుకు, కొందరు నాయకులు, సాకులు చూపి తప్పించుకుంటున్నారు? అనేది ఇటు పార్టీలో అటు  రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం  అయింది. 

వరుస ఓటములతో పార్టీ క్షేత్ర స్థాయిలో పార్టీ కనుమరుగై పోయిన నేపధ్యంలో   సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, నిజానికి పార్టీ అధిష్టానమే ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ఆలోచన చేస్తోందని, అందుకే  అయన తనంతట తానుగా బాధ్యతల నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అదైన,ఇదైనా సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ నాయకత్వంలో త్వరలోనే మార్పు తధ్యమని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి వీర్రాజు శక్తి సామర్ధ్యాలు సరిపోవదం లేదు. మరో వంక ఆయనలోనూ ముందున్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. ఫలితంగా  ఏపీలో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.ఇక రాష్ట్రంలో తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికతో  సహా, అన్ని ఎన్నికల్లోనూ బిజెపి చావుదెబ్బ తినడం వంటి కారణాలు సోము వీర్రాజు స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు కారణమయ్యాయని సమాచారం.

మరోవంక సోము వీర్రాజు, పార్టీ సీనియర్ నాయకులూ ఎవరూ సహకరించక పోవడం, మిత్రపక్షం జనసేన కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కాదని నేరుగా కేంద్ర నాయకత్వంతో సంప్రదింపు జరపడం, రాష్ట్రంలో ఉమ్మడి కార్యాచరణకు కలిసి రాక పోవడం వంటి,అనేక  అవమానకర సంఘటనలు ఎదురవుతున్న పరిస్థితిలో, పొమ్మనేదాకా చూరు పట్టుకుని వేళ్ళాడే కంటే ముందుగ గౌరవప్రదంగా తనంతటతానే పదవినుంచి తప్పుకోవడం ఉత్తమం అనే భావిస్తునట్లు తెలుస్తోంది. 
అయితే, ఈసారి ఏపీలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే, సోము వీర్రాజుతో పాటుగా, మరో కొందరిపై కూడా వేటు పడడం ఖాయమని  అంటున్నారు. అలాగే, ఈసారి, పార్టీ నాయకత్వ కూర్పులో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అధ్యక్ష పదవితో పాటుగా కీలక పదవువులు ఇచ్చే అవకాశం  ఉందని అంటున్నారు. ఏపీలో బీజేపీ ఎదగాలంటే ఇతర పార్టీల సీనియర్ నాయకులను ఆకర్శించక తప్పదని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. అదే డైరెక్షన్’లో పార్టీని ముందుకు తీసుకుపోయే నేతకే ఈ సారి పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.