ఏపీలో థియేట‌ర్లు ఓపెన్‌.. 70కోట్లు ఎవ‌రివి?.. బ్లేడ్ బ్యాచ్ దాడి.. టాప్‌న్యూస్ @1pm

Publish Date:Dec 30, 2021

Advertisement

1. ఏపీలో సీజ్‌ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నెలరోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణ‌యంతో 9 జిల్లాల్లో సీజ్ అయిన  83 థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందు కోసం జాయింట్‌ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. 

2. సమూహ ప్రాజెక్ట్స్‌ సంస్థ‌పై ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నట్టు ప‌లు వార్తా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఏకంగా 70కోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ కంపెనీ కొంద‌రు వైసీపీ పెద్ద‌ల బినామీ సంస్థ అని అంటున్నారు. స‌మూహా ప్రాజెక్ట్స్‌ సంస్థ ఓ వైసీపీ మంత్రికి చెందిన‌దిగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. 

3. గతేడాది అక్టోబర్ నెలలో భారీ వర్షాలతో 12 కి.మీ. ఉండే హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా పొంగిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రిటైనింగ్ వాల్ ఒక్కటే ఈ నాలా పొంగి ఇళ్లలోకి నీరు రాకుండా ఉండేందుకు పరిష్కారమని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కలిసి హైదరాబాద్ నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరామని.. వెంటనే స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం రూపొందించినట్టు తెలిపారు. 858 కోట్లతో మొదటి దశ ప్రాజెక్టు పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. 

4. గుంటూరులోని టవర్‌కు జిన్నా పేరు పెట్టడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ద్రోహి ఆలీ జిన్నా పేరు గుంటూరులో టవర్‌కు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కడో పాకిస్తాన్‌లో ఉండాల్సిన పేరు ఇక్కడ పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. ఆ టవర్‌కు అబ్దుల్ కలామ్ లేదా గుర్రం జాషువా పేర్లు పెట్టాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. 

5. హైద‌రాబాద్ నాంపల్లిలో జరిగే ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్ చేశారు. ఎగ్జిబిషన్‌ వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లను నిలిపివేయాలని పట్టుబట్టారు. పలు రాష్ట్రాలు న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు పెట్టాయని.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. 

6. మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డికి కార్యకర్తలు, అభిమానులు స్వాగత ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత రాత్రి పలు సెంటర్‌లలో ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

7. అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు ప‌వ‌ర్ క‌ట్ చేస్తూ విద్యుత్ శాఖ ఝ‌ల‌క్ ఇస్తోంది. భారీగా పెండింగ్ బిల్లులు ఉండ‌టంతో కోత‌లు విధిస్తోంది. మొన్న పుట్టపర్తి పంచాయితీ ఆపీసు.. తాజాగా అనంతలో జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ప‌వ‌ర్ స‌ప్లై ఆపేసింది. 3.86 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు విద్యుత్ అధికారులు తెలిపారు.

8. డ్రంకన్ డ్రైవ్ ప్రమాదకరమంటూ ప్రచారం చేస్తున్న పోలీసులు ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ ప్రమాదానికి కారకులవుతున్నారు. ఒంగోలులో ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ మద్యం మత్తులో బైక్‌ను నడుపుతూ ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడు దినేష్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

9. విజయవాడ వైఎస్సార్ కాలనీలో బ్లేడ్ బ్యాచ్ వ్యక్తి వీరంగం సృష్టించాడు. గంజాయి సేవించి స్థానికులపై దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు అతనిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చిత‌క్కొట్టారు. పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు. 

10. "తిరుమలలో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేస్తున్నాం. దుకాణాల నిర్వాహకులు కూడా బయోడిగ్రేడబుల్‌ క్యారీ బ్యాగులనే వినియోగించాలి" అని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్ప‌ష్టం చేశారు. మూడు నెలలు గడువు ఇస్తున్నామని, అందరూ ప్లాస్టిక్‌ నిషేధానికి సహకరించాలన్నారు. 
 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.