టీఆర్ఎస్ పై 'కోదండం' ఎక్కుపెడుతోన్న టీజేఏసీ!
Publish Date:Sep 3, 2016
Advertisement
సాధారణంగా పాలక పక్షానికి అతి పెద్ద తలనొప్పి ఎవరుంటారు? ఇంకెవరు, ప్రతి పక్షమే! కాని, తెలంగాణలో సీన్ వేరేలా వుంది. అధికార టీఆర్ఎస్ కి ప్రతిపక్ష కాంగ్రెస్ కన్నా పెద్ద తలనొప్పి మరొకటి తయారైంది. అదే టీజేఏసీ!
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకప్పుడు టీఆర్ఎస్ కి పెద్ద అండ. ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ , టీజేఏసీ రెండూ కలిసి పని చేశాయి. కాని, ఇప్పుడు అవే రెండు కత్తులు దూస్తున్నట్లు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా, జేఏసీ చైర్మన్ కోదండరామ్ టీఆర్ఎస్ నేతల ఆగ్రహానికి పదే పదే గురవుతున్నారు. తాజాగా కేసీఆర్ కూతురు, నిజాంబాద్ ఎంపీ కవిత ఆయన్ని టార్గెట్ చేశారు!
ఎంపీ కవిత కోదండరామ్ పై విమర్శలు ఎక్కుపెట్టటానికి కారణం ఈ మధ్య జరిగిన ఆల్ పార్టీ మీటింగ్. జేఏసీ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కి ప్రధానమైన టీఆర్ఎస్ నే పిలవలేదట. అయితే, మీటింగ్ ఎందుకు పెట్టారంటే... నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ తెరిపించాలనే డిమాండ్ తో మీటింగ్ పెట్టారు. అంటే... అధికార పార్టీగా తమ ప్రభుత్వం చేత టీఆర్ఎస్సే నిజాం షూగర్ ఫ్యాక్టరీ తెరిపించాలన్నమాట! అందుకే, ఆ పార్టీని తప్ప జేఏసీ మిగతా అన్ని పార్టీల్ని పిలిచింది. కాని, ఇదే విషయం కవిత ఆగ్రహానికి కారణమైంది...
ఆల్ పార్టీ మీటింగ్ అని పేరు పెట్టి తమని పిలవకపోవటం ఏంటని ప్రశ్నించిన కవిత అక్కడితో ఊరుకోకుండా ఇన్ డైరెక్ట్ విమర్శలు చాలానే చేశారు. జేఏసీ పెద్దలు ప్రభుత్వం వాదన వినేందుకు సిద్ధంగా లేరని ఆమె అన్నారు. అంతే కాదు వాళ్లు జనం నుంచి కొన్ని అంశాలు దాచి పెడుతున్నారని దుయ్యబట్టారు. అయితే, కవిత ఎక్కడా కోదండరామ్ పేరు ఊపయోగించకపోయినా ఆమె మాటలు ఆయన్నే టార్గెట్ చేశాయని ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది...
నిజాం షూగర్ ఫ్యాక్టరీ విషయంలోనే కాదు కోదండరామ్ ఈ మధ్య కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ జనం కోరినట్లు విభజన చేయాలని ఆయన సుది మెత్తగా సూచించారు! ఇక మల్లన్న సాగర్ కోసం భూముల సేకరణ అంశంలో కూడా కోదండరామ్ నిరసన స్వరమే వినిపించారు. ఆ మద్య కేసీఆర్... నిరాధారంగా ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు జైలుకెళతారని ఘాటుగా స్పందిస్తే... కోదండరామ్, పాలకులు అపొజిషన్ చేసే విమర్శకు తగిన విధంగా సమాధానం ఇవ్వాలని చెప్పుకొచ్చారు! మొత్తం మీద తనకు వీలున్నప్పుడల్లా జేఏసీ చైర్మన్ టీఆర్ఎస్ కి, కేసీఆర్ కి వ్యతిరేకంగా గొంతు వినిపిస్తూనే వున్నారు...
నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ లోని చాలా మంది నాయకులు కోదండరామ్ పై కామెంట్స్ చేసినా కేసీఆర్ ఫ్యామిలీ లీడర్స్ మాత్రం ఆయన్ని నేరుగా టార్గెట్ చేయలేదు. కవిత వ్యాఖ్యలతో కోదండరామ్ పై ముందు ముందు ప్రతి దాడి ఎక్కువయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. వాట్ని జేఏసీ చైర్మన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి...
http://www.teluguone.com/news/content/tjac-kodandaram-45-66031.html





