కూటమి ప్రభుత్వం కృషితోనే క్రీడావికాసం : మంత్రి లోకేష్
Publish Date:Apr 15, 2026
Advertisement
* క్రీడాకారులకు అండగా నిలిచిన లోకేష్ శెహభాష్ కూటమి ప్రభుత్వం కృషితో క్రీడావికాసం సాధ్యమవుతోందని, క్రీడాకారులకు మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ప్రశంసించారు. తిరుపతి స్పోర్ట్స్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో మంత్రి లోకేష్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడాకారులు సూచనలు-సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ షట్లర్ పీవీ సింధు మాట్లాడుతూ... చిన్నారులకు స్కూలు స్థాయి నుంచే వారికి ఇష్టమైన ఏదో ఒక ఆటలో శిక్షణ ఇస్తే ఉత్తమ క్రీడాకారులుగా రాణిస్తారని తెలిపారు. చదువుతోపాటు ఆటలకు కొన్ని పిరియడ్స్ ను కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో వైజాగ్ లో ఏర్పాటు చేస్తున్న బ్యాడ్మింటన్ అకాడమీలో చిన్నపిల్లలకు లాభాపేక్ష లేని పద్ధతిలో శిక్షణ ఇస్తామని తెలిపారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ... సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటుచేసి పిల్లలు, యువతకు క్రీడలపై అవగాహన కల్పించాలి. మంచి క్రీడాకారులను గుర్తించి స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సాహం అందించాలి. క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కోరారు. అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ... డిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారుల కోసం స్పెషల్ కరిక్యులమ్ డిజైన్ చేసినట్టే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్రీడాకారులకు ఇటువంటి సిలబస్ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మ మాట్లాడుతూ... 2028 ఒలింపిక్స్ ఆడేందుకు నేను సాధన చేస్తున్నాను. నాలాంటి వారికి స్పాన్సర్స్ ముఖ్యం. ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించాలని కోరారు. మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి దేవరాజ్ మాట్లాడుతూ... నేను 2001 నుంచి విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించాను. ఒకప్పుడు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు శాప్ స్టేడియంలు ఉండేవి. ఇప్పుడు కూడా శాప్ ద్వారా ఔత్సాహికులను గుర్తించి శిక్షణ ఇవ్వాలి. ప్రముఖ అథ్లెట్ యర్రాజీ జ్యోతి మాట్లాడుతూ... గత రెండేళ్లలో రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి చెందింది. నాకు మంత్రి నారా లోకేష్ గారు అండగా నిలిచారు. అథ్లెటిక్స్ తోపాటు స్విమ్మింగ్, ఇతర మౌలిక సదుపాయాలు మరింతగా అభివృద్ధి చేయాలి. ప్రముఖ ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డి మాట్లాడుతూ.. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ కృషితో డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 421మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఎంతో మంచి పరిణామం. ఖోఖో క్రీడాకారులకు ప్రత్యేకంగా ఒక అకాడమీ ఉండాలి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి దండు పూజా మాట్లాడుతూ... ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ కోసం కావాల్సిన సహకారం ప్రభుత్వం అందిస్తోంది. తిరుపతి స్పోర్ట్స్ హబ్ కు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. హాకీ క్రీడాకారిణి రజని మాట్లాడుతూ... రియో ఒలింపిక్స్ తర్వాత చంద్రబాబుగారు నాకు ప్రోత్సాహం ఇచ్చారు. టోక్యో, కామన్ వెల్త్ గేమ్స్ ఆడాను. ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లాను. విలేజ్ లో చాలా టాలెంటెడ్ హాకీ ప్లేయర్స్ ఉన్నారు. వారికి ప్రోత్సాహం అందించాలి. న్యూ థింకింగ్, విజన్ తో క్రీడాభివృద్ధికి కృషిచేస్తున్న మంత్రి లోకేష్ కు అభినందనలు తెలిపారు. ఈ భేటీలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ నమ్మాళ్వార్, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), పంగి కరుణ కుమారి (బ్లైండ్ క్రికెట్), ముసునూరి రోహిత్ లలిత్ బాబు (చెస్), షేక్ అర్షద్ (పారా సైక్లింగ్), కిల్లాక లలిత (పారా అథ్లెటిక్స్), తమిరి సూర్య చరిష్మ (బ్యాడ్మింటన్), తిరుమూరి గణేష్ మణిరత్నం (ఆర్చరీ), నవ్య కండేరి (బ్యాడ్మింటన్), కె.ద్వారకనాథ్ రెడ్డి (బాస్కెట్ బాల్), శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు.
- స్కూలు నుంచే క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి
* వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించండి
* స్థానికంగా చిన్న స్టేడియంలు అభివృద్ధి చేయండి
* క్రీడాకారులకు స్పెషల్ కరిక్యులమ్ పరిశీలించండి
- మంత్రి లోకేష్‌తో ముఖాముఖిలో క్రీడాకారుల మనోగతం
http://www.teluguone.com/news/content/tirupati-sports-stadium-36-217453.html





