ఏపీలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల ప్రణాళిక : మంత్రి లోకేష్‌

Publish Date:Apr 15, 2026

Advertisement

 

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తిరుపతి స్పోర్ట్స్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు.  రాష్ట్రవ్యాప్తంగా 3,132 కి.మీల మేర యువగళం పాదయాత్ర చేపట్టినపుడు యువత ఆశలు, ఆకాంక్షలు తెలిశాయ‌న్నారు. రాయలసీమను స్పోర్ట్స్ హబ్ గా చేస్తాన‌ని ఇచ్చిన హామీ త్వ‌రలో కార్య‌రూపం దాల్చుతుంద‌న్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏం చేయాలనే విషయమై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు.

 

 

ఇటీవ‌ల నిర్వ‌హించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద 421మందికి పైగా ఉద్యోగాలు సాధించార‌ని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ప్రతిభను క్రీడారంగ అభివృద్ధికి ఉపయోగించుకుంటామ‌న్నారు. సీఎం చంద్రబాబు  హ‌యాంలోనే హైదరాబాద్‌లో  స్పోర్ట్ విలేజ్ ఏర్పాటైంద‌న్నారు. ఇక్క‌డ నుంచే జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు వ‌చ్చార‌ని తెలిపారు. 90రోజుల యాక్షన్ ప్లాన్ లో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ బెస్ట్ మెకానిజం తయారుచేద్దామ‌ని పిలుపునిచ్చారు. అట్ట‌డుగు స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామ‌ని తెలియ‌జేశారు. తిరుపతిలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో శాప్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన క్రికెట్ మైదానం చాలా బాగుంద‌ని, దీని నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల స‌హ‌కారం తీసుకుంటామ‌ని తెలిపారు. ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొని త‌మ ప్ర‌తిభ‌తో రాణిస్తోన్న‌ జ్యోతి య‌ర్రాజీ, శ్రీచరణి వంటి మహిళా క్రీడాకారిణుల‌కు చేయూత నందిస్తామ‌ని తెలిపారు. 

 

 

ఫిట్నెస్ మెరుగుప‌రిచే చ‌ర్య‌లు చేప‌డ‌తాం

రాష్ట్రంలోని బాలలకు ఫిట్ నెస్ లేకపోవడం క్రీడల్లో వెనుకబాటుకు ప్రధాన కారణంగా గుర్తించామ‌న్నారు. దీనిని అధిగ‌మించేందుకు ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తోపాటు తల్లిదండ్రుల స‌హ‌కారం అవ‌స‌రం అన్నారు. వ్య‌క్తిగ‌తంగా కాకుండా వ్య‌వ‌స్థీకృతంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తామ‌న్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి గ్రోత్ కారిడార్ల పరిధిలో క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారుచేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. క్రీడాకారులకు ఉద్యోగాల భ‌ర్తీలో న్యాయం జ‌రిగేలా పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తున్నామ‌న్నారు.

 

 

క్రీడాకారులు అభిప్రాయాలన్నింటినీ డాక్యుమెంటేషన్ చేసి, 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. ఈ భేటీలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్,  షట్లర్ పివి సింధు, అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, అథ్లెట్‌ యర్రాజీ జ్యోతి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ నమ్మాళ్వార్, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), పంగి కరుణ కుమారి (బ్లైండ్ క్రికెట్), ముసునూరి రోహిత్ లలిత్ బాబు (చెస్), షేక్ అర్షద్ (పారా సైక్లింగ్), కిల్లాక లలిత (పారా అథ్లెటిక్స్), తమిరి సూర్య చరిష్మ (బ్యాడ్మింటన్), తిరుమూరి గణేష్ మణిరత్నం (ఆర్చరీ), దండు పూజ (బ్యాడ్మింటన్), పి.శివారెడ్డి (ఖోఖో), ఇ. రజని (హాకీ), నవ్య కండేరి (బ్యాడ్మింటన్), కె.ద్వారకనాథ్ రెడ్డి (బాస్కెట్ బాల్), శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు.

 

By
en-us Political News

  
సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన సబ్సిడీ పెట్రోల్, డీజిల్ ను రిటైల్ ధరతో కొనుగోలు చేస్తూ పారిశ్రామిక రంగాలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
సిడ్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో సింధూ చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యూను 21-6, 21-9 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 27 నిముషాలలో ముగించిన సింధు.. సెమీస్ లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది.
రాష్ట్రం నుంచి నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న లోకేష్ వారికి అభినందనలు తెలిపి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలని కోరానని పేర్కొన్నారు.
అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు..తన లేఖలో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, వారికి అట్రాసిటీ చట్టం కింద ఎలాంటి హక్కులు వర్తించవని గుర్తు చేశారు.
విధుల్లో భాగంగా ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లిన ఆయన.. ఇటీవల ఎంటీ సెట్టెబెల్లో అనే వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నౌకలో జనరేటర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్న సమయంలో దాడి జరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నౌక యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది.
ఆపిల్ సరికొత్త మ్యాక్ ఓఎస్ 27 గోల్డెన్ గేట్ బీటా వెర్షన్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాకుండా రోజువారీ వాడకంలో యూజర్లకు ఉపయోగపడే టాప్ 5 ఫీచర్లు, డిజైన్ మార్పులు మరియు పెర్ఫార్మెన్స్ రివ్యూ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమరావతిలో రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయం, GPRA క్వార్టర్ల నిర్మాణం షురూ కానుంది. రాబోయే 72 గంటల్లో CPWD టెండర్లు విడుదల చేయనుండటంతో రాయపూడితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా పుంజుకుంటోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రాజ్ కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు అతడిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ముగిసిన తర్వాత, పోలీసులు అతన్ని తిరిగి కడప జైలుకు రైలేలో తీసుకువస్తుండగా.. గూడూరు రైల్వేస్టేషన్ వద్ద రాజ్ కుమార్ పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సరికొత్త రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. విన్నర్, రన్నరప్ జట్లకు దక్కే కోట్ల ప్రైజ్ మనీ వివరాలు మరియు కొత్త టోర్నీ ఫార్మాట్ విశేషాలు మీకోసం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్ మోసాలపై భారత ప్రభుత్వం బ్యాంకులు మరియు యూపీఐ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి.
భూమిపై మొట్టమొదటి సంక్లిష్ట కణాల (Eukaryotes) ఆవిర్భావం వెనుక ఉన్న జన్యు రహస్యాలను బార్సిలోనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్లు, బ్యాక్టీరియాల అద్భుత సమ్మేళనంతో జరిగిన ఈ జీవ పరిణామ క్రమం గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.
2027 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సురేశ్ రైనా ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ, ప్రిన్స్ యాదవ్ ఎంపికపై అనిల్ కుంబ్లే చేసిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ డీల్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో ఊరట లభించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్ల కంటే కిందకు పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు రికార్డు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ తాజా అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.