సింగర్ మంగ్లీ డీజీపీకి ఫిర్యాదు...“స్కామ్‌లతో నాకు సంబంధం లేదు”

Publish Date:Apr 15, 2026

Advertisement

 

తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. డీజీపీ కార్యాలయానికి వెళ్లిన మంగ్లీ, డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీ మహేష్ భగవత్‌కు అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు.గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని మంగ్లీ తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

“పాటలు తప్ప స్కామ్‌లు తెలియవు”

ఈ సందర్భంగా మంగ్లీ భావోద్వేగంతో మాట్లాడారు.“పాటలు తప్ప నాకు స్కామ్‌ల గురించి తెలియదు. నేను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. పేదరికం నుంచి వచ్చిన నేను డబ్బు విలువ బాగా తెలుసు. గత నెల రోజులుగా నా ప్రోగ్రామ్‌లు, రికార్డింగ్స్ కూడా వదులుకున్నాను. ఈ వివాదం ప్రజల్లోకి తప్పుగా వెళ్తోంది. నిజమైన బాధితులకు నేను ఎప్పటికీ అండగా ఉంటాను” అని తెలిపారు.ఈ వ్యవహారంలో మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రామావత్ మధు, సిద్ధు, సుబ్బారావుపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

న్యాయవాది ఆరోపణలు

మంగ్లీ తరఫు న్యాయవాది కూడా కీలక ఆరోపణలు చేశారు.“నేరగాళ్లే బాధితుల రూపంలో పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. అసలు స్కాం చేసిన వారే మీడియా ముందుకు వచ్చి బాధితులుగా మాట్లాడుతున్నారు” అని ఆరోపించారు.అలాగే, “సుభాక్షేత్ర బిజినెస్ అనే పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేసి మధు ఎండీగా ఉన్నాడు. ప్రస్తుతం బాధితుడిగా మాట్లాడుతున్న హిమాకాంత్ రెడ్డి అదే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ స్కాం వ్యవహారానికి మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు.ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించే అవకాశముందని సమాచారం.
 

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్పందించింది.
దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.