జగన్ కేబినెట్ లో మహిళా మంత్రులు ముగ్గురూ.. ముగ్గురే!

Publish Date:May 13, 2022

Advertisement

పెట్టే చేయి కంటే..తిట్టే నోటితోనే కొంచం జాగ్రత్తగా ఉండాలని భావించారేమో ఏపీ సీఎం జగన్. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి మంత్రి వర్గంలో  బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబులకు కీలక పోర్ట్ పోలియోలు కేటాయించారు.  వారిరువురూ కూడా గతంలో జగన్ పై విమర్శనాస్త్రాలూ, వ్యంగ్యాస్త్రాలూ సాధించిన వారే. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఆయన అదే సూత్రాన్ని పాటించారు. తన కేబినెట్ లో కీలక పదవులలో నియమించిన ముగ్గరు మహిళా మంత్రులూ ఒకప్పుడు తననూ, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డినీ నోరారా విమర్శించిన వారే. జగన్ తన కేబినెట్ లో కీలక పోర్టు పోలియోలు కేటాయించిన ముగ్గురు మహిళలూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన వారే. తెలుగుదేశం పార్టీలో ఉండగా వైఎస్ పై అంతకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించిన వారే. సరే దరిమిలా గోడ దూకి వైసీపీలో చేరారు. ఆ ముగ్గురూ ఆర్కే రోజా, విడదల రజనీ, తానేటి వనితలు. వారు గతంలో జగన్ పై విమర్శలను ఇప్పుడు వైసీపీ శ్రేణులు గుర్తు చేసుకుని ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడమంటే ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ముగ్గురు మహిళా మంత్రులూ కూడా తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరించిన వారే. పసుపు కండువా కప్పుకుని జగన్ పై నిప్పులు చెరిగిన వారే. ఆ తరువాత పార్టీ మారి ఫ్యాన్ గాలికి సేదతీరుతున్నవారే. కేబినెట్ లో తానేటి వనితకు కీలకమైన హోంశాఖ, విడదల రజనికి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్కే రోజాకు పర్యాటక శాఖ దక్కాయి. 

 వీరిలో తానేటి వనిత 2009లో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే మూడేళ్లలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పంచన చేరారు. తెలుగుదేశంలో ఉండగా ఆమె  జగన్ పై సుతిమెత్తటి విమర్శలే చేశారు. 2014 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జవహర్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలలో అదే నియోజకవ్రగం నుంచి విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేసిన తానేటి వనతి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రమోషన్ పొంది హోంమంత్రి అయ్యారు. ఇక విడదల రజనీ విషయానికి వస్తే.. 
2018లో ఇలా జగన్ పార్టీలో చేరి.. అలా ఎమ్మెల్యే టికెట్ అందుకొని చిలకలూరి పేట  ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.  విడదల రజినీ 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున చురుకుగా ప్రచారం చేశారు. ఆ సమయంలో వైసీపీ అధినేత జగన్ పై విమర్శల బాణాలను గురిపెట్టారు.  అప్పట్లో  జగన్‌పై విడదల రజినీ విమర్శల నిప్పులు చెరిగారు.  ఆ తరువాత నాలుగేళ్ల లోనే వైసీపీ గూటికి చేరారు. తాను అంతగా విమర్శించిన జగన్ చేతుల మీదుగా పార్టీ టికెట్ అందుకుని అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలి మంత్రి పదవిని సాధించారు.  

ఇక రాజకీయ నాయకురాలిగా మారిన నటి ఆర్కే రోజా జగన్ పై చేసిన విమర్శల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా  తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలి హోదాలో జగన్ రెడ్డిపైనే కాదు, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.  ఆ తర్వాత ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఆ తరువాత కొద్దికాలానికే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కాంగ్రెస్ లో ఆమె ఉన్నది చాలా కొద్ది కాలమే. ఆ కొద్ది కాలం కూడా ఆమె ఉనికి కాంగ్రెస్ లో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఆ తరువాత రోజా జగన్ తో పాటే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో వైసీపీ విపక్షానికే పరిమితం అయ్యింది.  ఆర్కే రోజా మాత్రం నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో తెలుగుదేశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆమె విమర్శలన్నీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు టార్గెట్ గానే ఉండటంతో జగన్ ఆమెను బాగా ప్రోత్సహించారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా జగన్ తొలి కేబినెట్ లో ఆమెకు స్ధానం దక్కలేదు. కానీ కీలకమైన ఊపీఐఐసీ చైర్మన్ పదవిని దక్కించుకో గలిగారు. ఇక తాజా కేబినెట్ విస్తరణలో రోజాకు కీలకమైన పర్యాటక శాఖ మంత్రిగా పదవి దక్కింది. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం వైసీపీలో మాత్రం అసంతృప్తి పేరుకు పోయంది. ప్రత్యర్థి పార్టీలో ఉండి అధినేతపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఆ తరువాత పార్టీ మారి వచ్చిన వారికి కీలక పదవులు దక్కడంపై పలువురు నేతలు తమ ఆగ్రహాన్ని పెదవి మాటునే దాచేసుకుని రగిలి పోతున్నారు. మొదటి నుంచీ పార్టీలో ఉండి.. అధినేతకు విధేయంగా మెలిగిన వారిని కాదని, పార్టీ మారి వచ్చిన వారికి పదవుల అందలాలు దక్కడం పట్ల అంతర్గత సంభాషణల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు అయితే పార్టీ కార్యక్రమాలలో నామమాత్రంగా పాల్గొంటు, ఇంచు మించు సైలెంట్ అయిపోయారు. 

By
en-us Political News

  
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.