పవన్ పై మాజీ మంత్రి అనిత్ అవాకులు.. పదవి పోయిందన్న ఫస్ట్రేషనేనా?

Publish Date:May 13, 2022

Advertisement

తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటికి పని చెప్పారు. ఈ సారి అలా ఇలా కాదు.. ఏం మాట్లాడుతున్నారో తెలిసో తెలియదో అని అంతా భావించేలా. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లేందుకు అడ్డు వచ్చిన ఆరోగ్యం.. విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రతిపక్ష నాయకులపై ఇష్టారీతిన నోరు పారేసుకోవడానికి మాత్రం అడ్డు రాలేదు.

ఇంతకీ శుక్రవారం  మీడియాతో ఆయన ఏం మాట్లాడారంటే.. పవన్ కల్యాణ్ పొత్తులు ఎవరితోనో, పెళ్లిళ్లు ఎవరితోనో మాకు అవసరం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల పొత్తులు పెళ్లిళ్లతో మాకు పని లేదన్నారు. ఇంతకీ అంత ఆగ్రహం ఆయనకు ఎందుకు వచ్చిందంటే.. గడప గడపకూ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ముస్లిం మహిళలు తరిమి కొట్టారంటూ జనసేన చేసిన ఒక పోస్టు. దీంతో ఆయనకు ఎక్కడో కాలింది. దాంతో ఇంత కాలం మోహం చాటేసిన ఆయన ఒక్క సారిగా మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన చెలరేగిపోయారు.

ముస్లిం మహిళలు తనను తరిమి కొట్టారంటూ జనసేన వాళ్లు పోస్టు చేసిన వీడియో పాతదనీ, తానింత వరకూ గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొననే లేదనీ చెప్పేశారు. గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కు ఆరోగ్యం బాలేదన్న అనిల్ కుమార్ యాదవ్ ఒళ్లు మరచిపోయేంత ఆవేశంతో మీడియాతో మాట్లాడడానికి అరోగ్యం ఎలా అనుమతించిందో చెప్పలేదు.

 కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన తరువాత కొద్ది రోజులు తాజా మంత్రి కాకాణిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా హడావుడి చేసిన అనీల్ కుమార్ యాదవ్.. ఆ తరువాత కారణాలేమైతేనేం.. మౌనవ్రతం పూనారు. దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పడు హఠాత్తుగా తెరమీదకు వచ్చి జనసేనానిపై అవాకులతో చెలరేగిపోయారు. పనిలో పనిగా ప్రతిపాదనలో ఉన్న తెలుగుదేశం, జనసేన పొత్తులపై కూడా విమర్శలు గుప్పించేశారు.

 సంక్షేమ పథకాలతో జగన్ కు ప్రజా మద్దతు అంతకంతకూ పెరుగుతుండటం చూసి భయం పట్టుకునే వాళ్లు కలిసి పోటీ చేద్దామనుకుంటున్నారన్నారు. జనసేన బీజేపీకి తొత్తు అని చెప్పిన అనీల్ కుమార్ యాదవ్ అలాంటి జనసేన తెలుగుదేశంతో కలిసి ముస్లింలను వైసీపీకి దూరం చేయాలని కలలు కంటోందన్నారు.  చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల వయస్సులపై కూడా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.  యూట్యూబుల్లో ఇష్టారీతిన పోస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు.

తాను కామ్ గా ఉన్నా తన అభిమానులు ఊరుకోరన్నారు.  అనుచిత వ్యాఖ్యలతో అనీల్ రెచ్చిపోవడానికి కారణం మంత్రిపదవి పోయిందన్న ఫ్రస్ట్రేషనే కావచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమం అయిన గడప గడపకూ ప్రభుత్వం కు దూరంగా ఉండటంతోనే వైసీపీలో ఆయన పనైపోయిందని అర్ధమౌతోందని జనసేన వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. 

By
en-us Political News

  
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.