లేచి నిలబడటానికి దొబ్బిడాయా?

Publish Date:Oct 25, 2017

Advertisement

విచారణలో ఉన్న కేసులు కోర్టుల్లో కోకొల్లలు. ఇప్పుడున్న న్యాయమూర్తులందరూ రిటైరైనప్పటికి కూడా.. ఈ కేసులు పూర్తవ్వవు. పైగా కొత్త కొత్త కేసులు  పుట్టుకొస్తుంటాయ్. కాబట్టీ... ఉన్న కేసులపై న్యాయమూర్తులు దృష్టి సారిస్తే సరిపోతుంది. ఉపయోగం లేని  వ్యవహారాలపై సమయం వృద్ధా చేసుకోవడం సుద్ధ దండగ. ఇది కేవలం నా అభిప్రాయం.

 

‘సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పని సరి.. అందరూ లేచి నిలబడాల్సిందే’ అనే నిబంధన పెట్టింది న్యాయస్థానాలే. ఈ వ్యవహారంపై ఎవరో ‘మేధావి’ గారు...‘ఎందుకు నిలబడాలి’ అని కోర్టులో పీల్ దాఖలు చేశారు. పనిలేనోడు పిల్లి తల గొరిగాట్ట. బహుశా వీరిది అదే కోవ. వార్తల్లో వినిపించాలి, కనిపించాలి.. ఈ కక్కుర్తితో.. సింపుల్ గా కొన్ని కాగితాలు నావి కావ్ అనుకుంటారు. వీటిపై కోర్టెందుకు స్పందించాలి? ‘మాకు చాలా పనుంది’ అని వి...స్సిరి అవతలేయొచ్చుగా? పక్కనే డస్ట్ బిన్లు ఉన్నాయి కూడానూ! 

 

అసలు నాకు తెలీక అడుగుతానూ... జాతీయ గీతం వినిపిస్తే... కాసేపు నిలబడటానికి దొబ్బిడాయా? జనవరి 26న ఓ సారి... పంద్రాగస్టున మరో సారి... జాతీయ జెండాకు ‘జై’ కొట్టే  సిగ్గులేని ‘జాతి’ మనది. సినిమాలు మాత్రం వారానికోసారి చూడాల్సిందే. ఏ? ఏసీ థియేటర్లో కూర్చున్నప్పుడు.. కాసేపు ‘జనగణమన’ కోసం లేచి నిలబడతే మీ సొమ్మేమైనా పోతుందా? 

 

‘అలా నిలబడటం అసహజంగా ఉంటుందట’ ఒకాయన అన్నాడు. ‘భక్తి మనసుల్లో ఉండాలట’ ఇది ఇంకొకరి స్టేట్మెంటూ!. ఎదురుగా తెరపై జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంటే... నువ్వు ఏసీ థియేటర్లో కాలుమీద కాలేసుకొని చూస్తూ కూర్చోవడం దేశభక్తి అవుతుందా? మనకు స్కూళ్లలో నేర్పించి అదేనా?. నీ మనసులో భక్తి లేదని ఎవరూ అనడం లేదు. అది ప్రదర్శించే అవకాశం అరుదుగా మాత్రమే వస్తున్నప్పుడు... దాన్ని పాటించి, భావితరాల వారికి మార్గదర్శివి కమ్మని అంటున్నాం. అలా చేస్తే... నిన్ను చూసి నీ పిల్లలకు దేశభక్తి పెరుగుతుంది. దేశం పట్ల గౌరవభావం పెరుగుతుంది. దేశం తల్లి. దేశాన్ని ప్రేమించని వాడు తల్లిని కూడా ప్రేమించలేడు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ అర్థమవ్వాలి. దానికి ఇదే మార్గం. నిజానికి థియేటర్లలో జాతీయగీతం అనేది ప్రతి ఒక్కరికీ ఓ మహద్భాగ్యం. కానీ... కొందరు చీడపురుగులకు ఇది కూడా భారంగా కనిపిస్తోంది. ఇది మన దౌర్భాగ్యం. 

 

తమిళ నటుడు అరవింద్ స్వామిగారు రీసెంట్ గా ట్వీటాట్ట. ‘సినిమా హాళ్లలోనే వందేమాతరం ఎందుకు? ప్రభుత్వ కార్యాలయాల్లో, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్ ప్రారంభంలో జాతీయగీతం ఎందుకు వినిపించదు?’ ఇవి ఈయనగారి ప్రశ్నలు. ఈ ప్రశ్నలను బట్టి... స్వామిగారి పరిజ్ఙానం ఏ పాటిదో తేలిపోయింది. ప్రభుత్వకార్యాలయాల్లో జాతీయ గీతం తప్పని సరి. పాటించకపోవడం వ్యవస్థలో సమస్య. ఇక కోర్టులు, పార్లమెంట్, అసెంబ్లీ అంటారా..! వాటి ప్రారంభ సమయాల్లో తప్పకుండా జాతీయ గీతాలాపన ఉండాల్సిందే. ఈ విషయం స్వామిగారికి తెలీకపోవడం.. రొంబా.. బాధాకరం.  ఏనాడైనా టీవీల్లో అయినా అసెంబ్లీ చూసిన ముఖమైతే...  ఆ విషయం తెలుస్తుంది. పాపం... ఇలాంటి వాళ్లను చూసి మనం జాలిపడటం తప్ప.. ఏమీ చేయలేం. ‘మేం మేధావులం’ అని వాళ్లకు వాళ్లు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఈ కారణంగానే... ఇలాంటి పస లేని స్టేట్మెంట్లు ఇస్తుంటారు. 


టోటల్ గా చెప్పేదొక్కటే... జాతీయ గీతం వినిపిస్తే... ‘లేచి నిలబడండి’. మంచి పని చేశామన్న ఆనందంతో మనసు నిండుతుంది. వెనుక తరాల వారికి ప్రవర్తన నేర్పిన వాళ్లం అవుతాం. ఎంతోకొంత కేలరీలైనా తగ్గుతాయ్ ..  అదన్నమాట విషయం‘జైహింద్’. 

By
en-us Political News

  
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.