Publish Date:Dec 31, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం (జనవరి 1) తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 8 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Publish Date:Dec 31, 2024
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారింది. ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రికార్డులు సృష్టించింది. జగన్ ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలూ పడిన జనం స్వచ్ఛందంగా తెలుగుదేశం సభ్యత్వం కోసం క్యూ కడుతున్నారు
Publish Date:Dec 31, 2024
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పార్టీని విజయపథంలో నడిపించి, విజయం తరువాత అధిష్ఠానం ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలకు దాదాపుగా చరమగీతం పాడేశారు.
Publish Date:Dec 31, 2024
నాగారం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వేల ఏళ్ల నాటి ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన విదేశీ బౌద్ధ పరిశోధకులు, స్థానిక ప్రదర్శనశాలలోని శిల్పాలను కొనియాడారని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, బుద్ధవనం కన్సల్టెంట్, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
Publish Date:Dec 31, 2024
తెలంగాణ సాధించిన పార్టీగా ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 2024 సంవత్సరం అత్యంత గడ్డుకాలంగా మిగిలిపోతుంది. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, ఆ తరువాత ఇప్పటి వరకూ కోలుకోలేదు సరికదా రోజు రోజుకూ దిగజారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Dec 31, 2024
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఫొటోల పిచ్చి చాలా చాలా ఎక్కువగా ఉండేది. అది ఆయన అధికారంలో ఉండగా పీక్స్ కు చేరింది. వైసీపీ నేతలే ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని అప్పట్లో తమలో తాము గుసగుసలాడుకేనే వారు. వైసీపీ పరాజయం తరువాత ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా పలు సందర్భాలలో చెప్పారు.
Publish Date:Dec 31, 2024
తిరుమల దేవుని దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఇక నుంచి టీటీడీ అనుమతించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేలా చూడాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
Publish Date:Dec 30, 2024
కాకినాడ జిల్లా తాళ్లరేవు తీరంలో తాబేళ్ల మరణాలు మిస్టరీగా మారాయి. ఇప్పటి వరకూ ఇంత పెద్ద సంఖ్యలో తాబేళ్లు ఇలా మరణించి తీరానికి కొట్టుకురావడం ఎన్నడూ చూడలేదని మత్స్య కారులు అంటున్నారు. తాళ్ల రేవు తీరంలో అరుదైన ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయనీ, ఈ మరణాల వెనుక ఏదో మిస్టరీ ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Publish Date:Dec 30, 2024
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాలను అందుబాటులోకి తీసుకువచ్చచేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉగాది పర్వదినం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించేందుకు నిర్ణయించారు.
Publish Date:Dec 30, 2024
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ తేజ్ ను ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. పలమనేరులో సోమవారం గౌతమ్ తేజ్ ను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయనను చిత్తూరు కోర్టులో హాజరు పరిచారు.
Publish Date:Dec 30, 2024
మనిషి రోజువారి జీవితంలో సోషల్ మీడియా ఓ భాగం అయిపోయింది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు రోజుకు కొన్ని గంటలు సోషల్ మీడియాలో నిమగ్నమై పోతున్నారు. దీనిద్వారా అనేక లాభాలు ఉన్నాయి. చదువుకునే వారి నుంచి వ్యాపార రంగం, రాజకీయ రంగం.. ఇలా ఏ రంగంలోని వారైనా సోషల్ మీడియా ద్వారా మరిన్ని విషయాలపై అవగాహన పెంచుకునే వీలుంటుంది. చాలా మంది దీనిని మంచి మార్గంలో వినిగించుకుంటుంటే.. కొందరు మాత్రం సోషల్ మీడియాను చెడుకు ఎక్కువగా వినియోగిస్తున్నారు.
Publish Date:Dec 30, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (డిసెంబర్ 31) ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
Publish Date:Dec 30, 2024
కామారెడ్డి జిల్లాలో ట్రయాంగిల్ సుసైడ్ కేసులో మరో ట్విస్ట్ చేటుసుకుంది. వీరు ఆత్మ హత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు జిల్లా ఎస్ పి సింధు శర్మ ఎదుట పెద్ద పంచాయతీ జరిగినట్లు తెలుస్తోంది.