Publish Date:Dec 31, 2024
తెలంగాణ సాధించిన పార్టీగా ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 2024 సంవత్సరం అత్యంత గడ్డుకాలంగా మిగిలిపోతుంది. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, ఆ తరువాత ఇప్పటి వరకూ కోలుకోలేదు సరికదా రోజు రోజుకూ దిగజారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతినడానికి ప్రధాన కారణం ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోవడం, మరో వైపు ఆయన స్థానంలో పార్టీని ముందుండి నడిపిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎటువంటి ప్రభావం చూపలేకపోవడమేనని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరింత అధ్వానంగా పెర్ ఫార్మ చేసింది. ఒక్కటంటే ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ ఓటు బ్యాంకును కూడా భారీగా పోగొట్టుకుంది. కొన్ని స్థానాలలో డిపాజిట్ కూడా కోల్పోయింది. ఇంత జరిగినా ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగలేదు. అంతెందుకు ఆయన కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్టై చాలా రోజుల పాటు జైలులో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు. పూర్తిగా తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. ఈ కష్ట కాలంలో పార్టీని నడిపించిన కేటీఆర్ ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన ప్రకటనలు, ఆందోళనలు, విమర్శలు పెద్దగా ప్రజలను కదిలించలేదు.
ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్.. తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో కూడా సఫలీకృతుడు కాలేకపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ప్రతిష్ఠ కోసమే ఈ ఫార్ములా రేస్ అంటూ చెప్పుకువచ్చిన కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము బదలాయింపు విషయంలో మాత్రం తన తప్పు లేదని అధికారులపై నెట్టేసి తప్పుకోవడానికి చూడటం పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తికి కారణమైందని చెబుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు రైతులను కదిలించడంలో విఫలమయ్యాయి. ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా కేసు నమోదు చేసి కేటీఆర్ కు నోటీసులు పంపింది. ఈ కేసులో ఫెమా, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, నిబంధనలను తుంగలో తొక్కి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వాహకులకు అక్రమ చెల్లింపులు జరిగాయనీ ఆధారాలు ఉన్నాయనీ ఈడీ చెబుతోంది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు అయ్యే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని పార్టీ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-in-shambles-after-defeat-in-assembly-elections-39-190594.html
బుద్ధవనంలోని బౌద్ధ శిల్పాలు తమనేంతో ఆకట్టుకున్నాయి అని విదేశీ బౌద్ధ పరిశోధకులు ప్రొఫెసర్ సారా కెన్డర్ లైన్, ప్రొఫెసర్ జాఫ్రిషా అన్నారు. బౌద్ధ ప్రదర్శనశాలల నిపుణులైన న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్ సారా ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా ఇంకా హాంకాంగ్ నుంచి వచ్చిన మరో ఇద్దరు బౌద్ధ పరిశోధకులు నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించినట్టు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి చెప్పారు.
సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రిషిక్ కెమికల్ గోడౌన్ లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి . దూలపల్లిలో జరిగిన ఈ ప్రమాదం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కరోనాకు పుట్టిల్లైన చైనాలో ఇప్పుడు అంత కంటే ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనాలాగే ఇది మనుషుల నుంచి మనుషులకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దీని వ్యాప్తి కరోనా వ్యాప్తి వేగంకంటే రెండింతలు ఎక్కువ.
జగన్ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ విద్య పూర్తిగా గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించారు.
సినీ నటి , బిజెపి నేత మాధవిలత పై తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెన్నానది ఒడ్డున జెసిపార్క్ లో ప్రతీ యేడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి
ఆధునికత, సృజనాత్మకత, ప్రజా ప్రయోజనం, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఇవీ.. చంద్రబాబు పాలనకు ట్రేడ్ మార్కులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన అలాగే సాగింది. ఆ తరువాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు పాలన అదే బాటలో సాగింది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఆయన ఆధునికత, సాంకేతికతల మేళవింపుతో ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ బీఆర్ఎస్ అధినేత క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఆయన క్రీయాశీలంగా లేకపోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా బలహీనపడింది. ఆ పార్టీ క్యాడర్ నిరాశలో మునిగిపోయింది.
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్ పోర్ట్ ల అంశంపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర పౌర విమానయానశాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్ లైన్ లో సమీక్షకు హాజరయ్యారు.
అడ్డగోలుగా అవినీతికి పాల్పడి.. తీరా అది బయటపడేసరికి తమదేం లేదు.. అంతా తమ వద్ద పని చేసేవారే చేశారంటూ బుకాయించి తప్పించుకోవడానికి మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న ప్రయత్నాలు ఫలింలేలా లేవు. సొంతంగా ఓ గోడౌన్ నిర్మించి దానికి పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చి.. ఇటు అద్దె సొమ్ములు తీసుకోవడమే కాకుండా, ఆ గోడౌన్ లో పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మాయం చేసిన కేసులో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధా పూర్తిగా ఇరుక్కున్నారు.
తెలుగు రాష్ట్రాలను చలి వణికించేస్తున్నది. ఇరు రాష్ట్రాలలోనూ కూడా పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు పొగమంచు కమ్మేస్తుండటంతో ఉదయం 9 గంటలకు కూడా విజిబులిటీ తక్కువగా ఉండటంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సజ్జల భూ బాగోతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా సర్వం తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే. షాడో సీఎంగా సజ్జలే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి.