కామారెడ్డి ట్రయాంగిల్ సుసైడ్ కేసులో విస్తుపోయే నిజాలు ...

Publish Date:Dec 30, 2024

Advertisement

 తెలుగు రాష్ట్రాల్లో  సెన్సేషనల్ అయిన కామారెడ్డి జిల్లాలో ట్రయాంగిల్ సుసైడ్ కేసులో మరో ట్విస్ట్ చేటుసుకుంది. వీరు ఆత్మ హత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు జిల్లా ఎస్ పి  సింధు శర్మ ఎదుట  పెద్ద పంచాయతీ జరిగినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ , శృతి పెళ్లి చేసుకోవాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.  కానీ ఎస్ ఐ సాయికుమార్ అడ్డుపడ్డాడు.

ఎస్ఐ సాయికుమార్ తో శృతి అక్రమ సంబంధం కొనసాగించినట్లు ఆధారాలు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తన భర్త అక్రమ సంబంధంపై ఎస్ ఐ భార్య మహలక్ష్మి  ప్రతీరోజు గొడవపడేది. కానిస్టేబుల్ తో ఉన్న అక్రమ సంబంధాన్ని భర్తను నిలదీసేది మహలక్ష్మి.  నేను విడాకులు ఇవ్చవకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని పలుమార్లు హెచ్చరించింది మహలక్ష్మి.  చట్టబద్దంగా ఈ పెళ్లి చెల్లదు అయినా తనను  పెళ్లి చేసుకోవాలని శృతి  సాయికుమార్ పై వత్తి డి తెచ్చింది.  ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి    మూడేళ్ల కొడుకుతో మహలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం మహలక్ష్మి గర్బవతి.

భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో  మనస్థాపం చెందిన  ఎస్ ఐ సాయికుమార్ నిఖిల్, శృతితో గొడవపడ్డాడు. ఎస్ ఐ కంటే ముందే శృతికి నిఖిల్ తో ప్రేమ వ్యవహారం ఉంది.  పెళ్లి చేసుకోవాలనే సమయంలో ఎస్ఐ సాయికుమార్ విలన్ గా మారాడు. నాతో రిలేషన్ లో ఉన్నప్పుడు నిఖిల్ ను ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని నిలదీశాడు. ఎస్ ఐ ని పెళ్లి చేసుకోవడానికి శృతికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే సాయికుమార్ భార్య ఒప్పుకోకపోవడంతో వీరి ఫిజికల్ రిలేషన్ కు ఎండ్ కార్డ్ పడలేదు. దీంతో శృతి పెళ్లికాని నిఖిల్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. శృతికి పెళ్లయి విడాకులు కూడా తీసుకుంది. బీబీ పేటలో ఒంటరిగా ఉంటోంది.

ఎస్ ఐ సాయికుమార్ టార్చర్ ఎక్కువ కావడంతో నిఖిల్ ఎస్పిని ఆశ్రయించాడు. సాయికుమార్ తరపున ఒక సిఐ , ఎస్ఐ మధ్యవర్తిగా ఉంటూ సమస్యను పరిష్కారం చేయాలనుకున్నారు. 
కానీ ఎస్ఐ స్వయంగా రంగంలో దిగాడు. శృతి, నిఖిల్ ను పెద్ద చెరువు వద్దకు రమ్మన్నాడు. అర్దరాత్రి సమయంలో  ముగ్గురి మధ్యమాటామాటా పెరగడంతో శృతి చెరువులో దూకేసింది. శృతిని రక్షించడానికి నిఖిల్ , వీరిద్దరిని రక్షించడానికి సాయికుమర్ నీళ్లలో దూకాడు ఈత రాకపోవడంతో ముగ్గురు చనిపోయారు. పోలీసు శాఖ పరువు పోతుందన్న భయంతో ఉన్నతాధికారులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. .  చట్టాన్ని రక్షించాల్సిన శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం డిపార్ట్ మెంట్ కే కళంకం తెచ్చింది.
 

By
en-us Political News

  
బుద్ధవనంలోని బౌద్ధ శిల్పాలు తమనేంతో ఆకట్టుకున్నాయి అని విదేశీ బౌద్ధ పరిశోధకులు ప్రొఫెసర్ సారా కెన్డర్ లైన్, ప్రొఫెసర్ జాఫ్రిషా అన్నారు. బౌద్ధ ప్రదర్శనశాలల నిపుణులైన న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్ సారా ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా ఇంకా హాంకాంగ్ నుంచి వచ్చిన మరో ఇద్దరు బౌద్ధ పరిశోధకులు నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించినట్టు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి చెప్పారు.
 సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ  నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. 
 జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  రిషిక్ కెమికల్ గోడౌన్ లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి . దూలపల్లిలో జరిగిన ఈ ప్రమాదం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కరోనాకు పుట్టిల్లైన చైనాలో ఇప్పుడు అంత కంటే ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనాలాగే ఇది మనుషుల నుంచి మనుషులకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దీని వ్యాప్తి కరోనా వ్యాప్తి వేగంకంటే రెండింతలు ఎక్కువ.
జగన్ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ విద్య పూర్తిగా గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించారు.
 సినీ నటి , బిజెపి నేత  మాధవిలత పై  తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెన్నానది ఒడ్డున జెసిపార్క్ లో ప్రతీ యేడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి
ఆధునికత, సృజనాత్మకత, ప్రజా ప్రయోజనం, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఇవీ.. చంద్రబాబు పాలనకు ట్రేడ్ మార్కులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన అలాగే సాగింది. ఆ తరువాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు పాలన అదే బాటలో సాగింది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఆయన ఆధునికత, సాంకేతికతల మేళవింపుతో ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ బీఆర్ఎస్ అధినేత క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఆయన క్రీయాశీలంగా లేకపోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా బలహీనపడింది. ఆ పార్టీ క్యాడర్ నిరాశలో మునిగిపోయింది.
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్ పోర్ట్ ల  అంశంపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర పౌర విమానయానశాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్ లైన్ లో సమీక్షకు హాజరయ్యారు.  
అడ్డగోలుగా అవినీతికి పాల్పడి.. తీరా అది బయటపడేసరికి తమదేం లేదు.. అంతా తమ వద్ద పని చేసేవారే చేశారంటూ బుకాయించి తప్పించుకోవడానికి మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న ప్రయత్నాలు ఫలింలేలా లేవు. సొంతంగా ఓ గోడౌన్ నిర్మించి దానికి పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చి.. ఇటు అద్దె సొమ్ములు తీసుకోవడమే కాకుండా, ఆ గోడౌన్ లో పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మాయం చేసిన కేసులో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధా పూర్తిగా ఇరుక్కున్నారు.
తెలుగు రాష్ట్రాలను చలి వణికించేస్తున్నది. ఇరు రాష్ట్రాలలోనూ కూడా పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు పొగమంచు కమ్మేస్తుండటంతో ఉదయం 9 గంటలకు కూడా విజిబులిటీ తక్కువగా ఉండటంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సజ్జల భూ బాగోతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా సర్వం తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే. షాడో సీఎంగా సజ్జలే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.