తెలంగాణ రాజకీయనేతలంతా ఢీల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సమాయత్తమై ఏకంగా ప్రత్యేక రైలులో హస్తిన వెడితే... ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు హస్తిన బయలుదేరారు. మొత్తం మీద ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడిందని చెప్పాల్సి ఉంటుంది.
ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశం తెరమీదకు రావడానికి ముందు వరకూ కూడా తెలంగాణ రాజకీయం మొత్తం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ లో జోష్ నింపగా, బీఆర్ఎస్ ను బెంబేలెత్తిస్తోంది. అయితే కేవలం కాళేశ్వరం కారణంగా బీసీ రిజర్వేషన్ల అంశం మరుగున పడేందుకు కాంగ్రెస్ ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కాళేశ్వరం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని డైవర్ట్ కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సభ్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంతిని బీఆర్ఎస్ కోర్టులోకి నెట్టేశారు. ఇప్పుడు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చలో పాల్గొనేదీ, లేనిదీ నిర్ణయించుకోవలసింది బీఆర్ఎస్, కేసీఆర్ లే. దీంతో కాంగ్రెస్ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం మేరకు హస్తినపై దృష్టి పెట్టింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు బుధవారం (ఆగస్టు 6) హస్తినలో జంతర్ మంతర్ వద్ద జరగనున్న భారీ ర్యాలీలో రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలంతా పాల్గొంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రయోగించిన బీసీ రిజర్వేషన్ అస్త్రం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకూ ఒక ఆయుధంగా మారింది.
రిజర్వేషన్ల కోసం పోరాడిని పార్టీగా పేరు తెచ్చుకునేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ పోటీలు పడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ తో విభేదించి సొంత మార్గంలో నడుస్తున్న కల్వకుంట్ల కవిత సైతం బీసీ పోరులో నేనున్నానంటూ హడావుడి చేస్తున్నారు. ఆఖరికి కేంద్రంలో అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ సైతం హస్తిన వేదికగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీరుకు, వైఖరికి నిరసనగా హస్తినలో గత శనివారం నిరసన కార్యక్రమం చేపట్టింది.
దిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఈనెల 6న బిసీ వర్గాలతో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ కార్యాచరణ రూపొందించింది. ఈ ధర్నాకు తెలంగాణలోని ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం పాతిక మందికి తక్కువకాకుండా సమీకరించి సోమవారం (ఆగస్టు 4) ప్రత్యేక రైల్‌లో దిల్లీ బాట పట్టింది రాష్ట్ర కాంగ్రెస్. జంతర్ మంతర్ ధర్నా కంటే ముందు పార్లముంటులో బీసీ రిజర్వేషన్లపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్ట ముందు ఈ నెల 5న పార్లమెంటులో బిసీ బిల్లుపై చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తోంది. చివరగా ఆగస్ట్ 7న అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆయోదించిన బిసీ బిల్లును ఆమోదించాల్సిందిగా రాష్ట్రపతికి వినతిపత్రాన్ని సమర్పించనుంది. మొత్తంమీద బిసీ రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతం అన్ని రాజకీయపార్టీలను పరుగులు పెట్టిస్తున్నది. త్వరలో రానున్న స్థానిక ఎన్నికలు ఈ రిజర్వేషన్‌లతో ముడివడి ఉండడంతో పార్టీలకు ఆ బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-politics-towrds-delhi-39-203526.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.