తెలంగాణా,ఆంధ్ర నీటిగొడవలు

Publish Date:Jul 1, 2012

Advertisement

దేన్నయినా రాజకీయం చేయగల తెలంగాణానాయకులకు మరో ఆయుధం దొరికింది. ఋతుపవనాలు రాక, వర్షాలకోసం చూచి చూచి వేసారిన కృష్ణా డెల్టా  రైతులు, వారు వేసిన నారుమళ్లు ఎండిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నీరు విడుదల చేయమని కోరారు. వారి అభ్యర్థనమేరకు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీటి విడుదలకు అంగీకరించింది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు నారుమడులకు నీరు వస్తుందని  ఆనందించేలోపే తెలంగాణానాయకులు డెల్టాకు నీరందించడాన్ని తెలంగాణ,ఆంద్రా నీటి రగడగా చిత్రీకరించారు. ఒక వేళ అదే జరిగితే అన్నపూర్ణగా విలసిల్లే ఆంధ్రప్రదేశ్‌  పట్టెడన్నం దొరకని దుర్బిక్షాన్ని ఎదుర్కొవలసి ఉంటుంది. ఇప్పటికే క్రాప్‌ హాలిడే ప్రకటించి సంగం మందిరైతులు పంట పండిరచడంలేదు. మిగతా రైతులకు గోరిచుట్టుమీద రోకలిపోటులా నాయకులు తెలంగాణ రాజకీయాలకు తెరలేపారు. వారు కేవలం రాజకీయాలకే పరిమితం  కాకుండా సాదాసీదా ప్రజలకొరకు కూడా ఆలోచించ వలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రతో ఉన్న నీటి గొడవలు చాలవన్నట్లు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర నీటిగొడవలు మొదలయ్యాయి. తెలంగాణాను ఎండబెట్టి కృష్ణాడెల్టాకు నీళ్లా అంటూ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని లేదంటే టిఆర్‌యస్‌ ఎమ్మేల్యేలంతా వెళ్లి నీటి విడుదలను అడ్డుకుంటామని టిఆర్‌ యస్‌ శాసనసభ ఉపపక్షనేత హరిశ్‌రావు హెచ్చరించారు. కృష్ణాడెల్టాకు 15 టియంసిల నీటిని విడుదల చేస్తూ తెలంగాణాకు దేవుడే దిక్కు అని వాఖ్యానించిన భారీ నీటి పారుదల మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. తెలంగాణా మంత్రులందరూ జరుగుతున్న  నీటి వివక్షకు ఎందుకు స్పందించడంలేదని అక్కసు వెళ్లగక్కారు. సీమాంద్రనాయకుల వల్లే ఇదంతా జరుగుతుందని తెలంగాణా ప్రజల గొంతు తడవకుండా ఇక్కడి నీళ్లు తరలించుకుపోతున్నారన్నారు. సీమాంద్రకు వెళ్లే సాగర్‌ కుడి కాలువకే నీరు విడుదల చేసి ఎడమకాలువకు ఎండబెడుతున్నారన్నారు.  కాగా సాగర్‌ రిజర్యాయర్‌లో 511 క్యూబిక్‌ మీటర్‌ లెవల్‌ వరకు మాత్రమే నీళ్లున్నాయని దానిలో ఒక అడుగు తగ్గినా హైదరాబాద్‌కు నీళ్లుండవని వివరించారు. నల్గొండ, మహబూబ్‌నగర్‌,హైదరాబాద్‌లకు తాగు నీరుండదని వెల్లడిరచారు. అయితే ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తాగునీటి సమస్య ఉండదని  హామీ ఇచ్చింది. ప్రతియేటా సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు జూన్‌ మొదటి వారంలోనే నీరు ఇస్తామని  ఈ సారి జాప్యం అయిందని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు.
 

By
en-us Political News

  
డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్‌ తెలిపారు.
 ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్ వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి.
దసరా రోజున పాలపిట్టలను సహజ సిద్ధమైన వాతావరణంలో, చెట్లపై స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే తిలకించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా పక్షుల బంధనం లేదా విక్రయం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే అటవీ శాఖ   అధికారులకు సమాచారం అందించాలని కోరింది.  
ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం బోసిపోయింది. అయితే నగరం నుంచి ఊళ్లకు వెళ్లే రహదారులు, జాతీయ రహదారులు ట్రాఫిక్ జామ్ లతో దాదాపుగా బ్లాక్ అయ్యాయి. ఊళ్లకు వెడుతున్న జనాలతో నిండిన వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారులపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారిని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాభివృద్ధి కలుగుతుందని, పిల్లలకు  బుద్ధికుశలత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది   తమ చిన్నారులతో కలిసి బాసర క్షేత్రానికి పోటెత్తారు.
నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో   ప్రతికూల ప్రభావం చూపిందని, దీని ఫలితంగా రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించిన సీఎస్..  సింగూరు డ్యామ్ దాని పరిసర ప్రాంతాలలో నీటి లభ్యతను, పంటల పరిస్థితిని   క్షేత్రస్థాయిలో పరిశీలించాననీ,  భూగర్భ జలమట్టాలు అత్యంత ఆందోళనకరంగా పడిపోయాయని తెలిపారు.
ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్ ఆరోపణల వెనుక నిజమెంత.?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.