జగన్ పార్టీలోకి పెరిగిన వలసలు

Publish Date:Jul 1, 2012

Advertisement

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మరిన్ని వలసలు, కులరాజకీయాలతో పార్టీలలో చిచ్చు

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తనయుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టినప్పటి నుండి రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వివిధ పార్టీల నుండి వలసల పర్వం ఆనాడే ప్రారంభమయ్యింది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలే కాకుండా ఎన్ని ఆంక్షలు విధించినా అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు సైతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆ ఎమ్మెల్యేలపై అధికార కాంగ్రెస్‌ పార్టీ కక్షసాధింపు చర్యలు చేపట్టడం, అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం లాంటి చర్యల ఫలితంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పెరిగిన సానుభూతి నేపధ్యంలో యిటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు జగన్‌ పార్టీకి పట్టంకట్టడంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సైతం నివ్వెరపోయింది. కేంద్ర ప్రభుత్వం కుటిల రాజకీయలు, రాష్ట్ర ప్రభుత్వంలో నాయకత్వ లోపం, వర్గ విభేదాలు, అమలువుతున్న ప్రజావ్యతిరేక విధానాలు ఫలితంగా దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిరది. దివంగత నేత వైఎస్‌ఆర్‌ హయాంలో వివిధ సంక్షేమ పధకాల ఫలాలను పేదలు అనుభవించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని నాయకులు ప్రజాసమస్యలు విస్మరించి, ఆధిపత్య పోరుతో ప్రజా పాలన పట్ల వైఫల్యం చెండటంతో విసుగు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యమ్నాయంగా తమ రాజకీయ మనుగడ కోసం జగన్‌ స్ధాపించిన వైఎస్‌ఆర్‌ సిపిలోకి పోతున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే జగన్‌ పార్టీ ప్రభావం ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందిగా మారిందంటే అతిశయోక్తి కావు.

 

 

సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి రాజకీయ ఆరంగ్రేట్రంతో ప్రారంభమైన కుల రాజకీయల చిచ్చు నేడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు అంటుకుంది. గతంలో ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ టిడిపిని స్ధాపించినా, అనంతరం  రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేసేందుకు చంద్రబాబు కృషి చేసినా, అప్పట్లో ఈ సామాజిక వర్గాల గోల, కుల రాజకీయాల పోరు, ఎక్కడా వినపడలేదు. అయితే నేటి  రాజకీయ పరిస్ధితులను అధ్యయనం చేస్తే పెరిగిన కుల చిచ్చు ఆయా పార్టీల ఉనికికి భంగం కలిగించే ప్రమాదం కూడా ఉందని   పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. యిదిలా ఉంటే కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మాత్రమే మద్ధతివ్వాలని, అలాగే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే మద్ధతివ్వాలని ఆయా పార్టీల అధినేతలు వారి వారి పార్టీలకు దిశనిర్ధేశాలను ఖారారు చేసుకుంటే, మరి భవిష్యత్‌లో ఆయా పార్టీల రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల నియంత్రణలోనే రాజకీయ పార్టీలు ఉన్నాయనే విషయం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు పూర్తిగా తెలిస్తే భవిష్యత్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరిన్ని రాజకీయ వలసలు పోయే ప్రమాదం లేకపోలేదని ప్రజలంటున్నారు.

By
en-us Political News

  
నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్ వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి.
దసరా రోజున పాలపిట్టలను సహజ సిద్ధమైన వాతావరణంలో, చెట్లపై స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే తిలకించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా పక్షుల బంధనం లేదా విక్రయం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే అటవీ శాఖ   అధికారులకు సమాచారం అందించాలని కోరింది.  
ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం బోసిపోయింది. అయితే నగరం నుంచి ఊళ్లకు వెళ్లే రహదారులు, జాతీయ రహదారులు ట్రాఫిక్ జామ్ లతో దాదాపుగా బ్లాక్ అయ్యాయి. ఊళ్లకు వెడుతున్న జనాలతో నిండిన వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారులపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారిని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాభివృద్ధి కలుగుతుందని, పిల్లలకు  బుద్ధికుశలత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది   తమ చిన్నారులతో కలిసి బాసర క్షేత్రానికి పోటెత్తారు.
నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో   ప్రతికూల ప్రభావం చూపిందని, దీని ఫలితంగా రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించిన సీఎస్..  సింగూరు డ్యామ్ దాని పరిసర ప్రాంతాలలో నీటి లభ్యతను, పంటల పరిస్థితిని   క్షేత్రస్థాయిలో పరిశీలించాననీ,  భూగర్భ జలమట్టాలు అత్యంత ఆందోళనకరంగా పడిపోయాయని తెలిపారు.
ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్ ఆరోపణల వెనుక నిజమెంత.?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.