సహనాన్ని పరీక్షించొద్దు..కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్
Publish Date:Feb 6, 2012
Advertisement
ఆదిలాబాద్: తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల సహనాన్ని పరీక్షిస్తే కేంద్రానికి పుట్టగతులుండవని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇప్పటికైనా తమ మొండివైఖరి వీడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా కేంద్రం మొద్దు నిద్రపోతున్నదని విమర్శించారు. ఆయన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు, ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేస్తుంటే కిరణ్ సర్కారు మొద్దు నిద్రపోతోందని దుయ్యబట్టారు. లక్ష ఉద్యోగాలిస్తామని సిఎం పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా, అవి డూప్లికేట్ అన్న భావనతోనే ప్రధాని ఆ కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తోందని తెలంగాణ ఏర్పడ్డాక ఒకే ఒక్క సంతకంతో అందర్నీ రెగ్యులరైజ్ చేసి, వారి కన్నీరు తుడుస్తామని హామీ ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/telangana-24-11623.html





