ఐఏఎస్ల బాధను అర్థం చేసుకున్నా బొత్స
Publish Date:Feb 6, 2012
Advertisement
హైదరాబాద్: ఐఏఎస్ల ఆవేదనతో ఏకీభవిస్తున్నానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఐఏఎస్లు వ్యక్తం చేసిన ఆవేదనను, బాధను అర్థం చేసుకున్నానని ఆయన అన్నారు. అయితే తప్పు చేస్తే మంత్రులైనా, అధికారులైనా బాధ్యత వహించాల్సిందేనని ఆయన తెలిపారు. తప్పు చేసినప్పుడు రాజయినా, బంట్రోతు అయినా సమానమేనని ఆయన అన్నారు. అవినీతిని నిర్మూలించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించడం సరైంది కాదని అన్నారు. ప్రజా ప్రతినిధులను సిబిఐ విచారించడం లేదనేది అవాస్తవమని ఆయన అన్నారు. సిబిఐకి పక్షపాత ధోరణి లేదని ఆయన చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి రాజా, డిఎంకె నాయకురాలు కనిమోళి జైలుకెళ్ళిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు.
ఇలాఉండగా జూబ్లీహాలులో జరిగిన ఒక సమావేశంలో బొత్స ప్రసంగిస్తూ బిసిలు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్సి సబ్ ప్లాన్ తరహాలో బిసిలకూ సబ్ ప్లాన్ను ప్రభుత్వం ఇచ్చేందుకు తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి బస్వరాజు సారయ్య ప్రసంగిస్తూ బిసిలకూ అన్ని విధాలా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. బిసిలకూ సబ్ ప్లాన్ను ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/ias-24-11620.html





