'నన్నుఅడుగొద్దు'మీడియ వల్ల అయోమయంలో జైపాల్
Publish Date:Jan 9, 2012
Advertisement
హైదరాబాద్: తెలంగాణపై మీ వైఖరి ఏమిటి, ఉప రాష్ట్రపతి పదవికి రేసులో ఉన్నారా అంటూ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి రంగారెడ్డి జిల్లాలోని తన నియోజకవర్గంలో మీడియా ప్రతినిధులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.దీంతో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. మీడియా ప్రతినిధులను వేడుకోవడం తప్ప ఆయన ఏమీ చేయలేకపోయారు. తెలంగాణపై వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వడానికి నిరాకరించారు. మీకో దండం అవన్నీ అడుగొద్దు అంటూ ఆయన తప్పించుకున్నారు. తాను ఉప రాష్ట్రపతి పదవికి రేసులో లేనని, అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ఈ విషయంలో వార్తలు సృష్టించి, రాసేస్తున్నారని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుంచి జైపాల్ రెడ్డి లోకసభకు ఎన్నికయ్యారు. తెలంగాణపై పెరుగుతున్న ఒత్తిడితో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవచ్చుననే వార్తలు ఇటీవల వచ్చాయి. అలా తప్పుకుంటూ ఉప రాష్ట్రపతి పదవికి రేసులో ఉంటారని కూడా వార్తాకథనాలు వచ్చాయి.
http://www.teluguone.com/news/content/telangana-24-10770.html





