తెలంగాణ నా ఊపిరి ,మరల దీక్ష చేస్తా: కేసీఆర్‌

Publish Date:Dec 26, 2011

Advertisement

హైదరాబాద్‌ : తెలంగాణ తన ఊపిరి అని ,తెలంగాణ కోసం మరోమారు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ స్పష్టం చేశారు. దేశంలో తోలు మందపు ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో టీలెక్చరర్ల క్యాలెండర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు, శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఈ దీక్ష ఉంటుందని ఆయన చెప్పారు. ఉద్యమాన్ని విరమించేది లేదని, వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. విరామం, సమయం ఇచ్చామని, అయినా ఫలితం లభించడం లేదని ఆయన అన్నారు. జనవరిలో సంక్రాంతి పర్వదినం తర్వాత ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. జాప్యం చేస్తే విద్వేషాలు మరింత పెరుగుతాయని, భౌగోళిక ఎడబాటుకు సీమాంధ్ర నాయకులు అంగీరించాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకుందని చెప్పారు.సమాజ్‌వాదీ పార్టీ తప్ప జాతీయ పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. గమ్యాన్ని ముద్డాడే వరకు ఉద్యమం ఆగదని అన్నారు. తెలంగాణ ఉద్యమం చల్లారలేదన్నారు. పూర్తిస్థాయి ఉద్యమం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. సమయాన్ని బట్టి ఓ వ్యూహంతో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ రాజకీయ నేతల కారణంగానే తెలంగాణ రాకుండా పోతుందని ఆయన తెలిపారు.  దాన్ని సాధించే వరకు మడమ తిప్పనని కేసీఆర్‌ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం సాధించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాడాల్సిందేనని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాలదే విజయమని, చరిత్రలో ధర్మం, న్యాయమే గెలిచిందని ఆయన అన్నారు. పాండవులు ఐదుగురే అయినా ధర్మం వైపు ఉన్నారు కాబట్టి గెలిచారని ఆయన అన్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని సంతరించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కెసిఆర్ మాట్లాడినా వార్తే, మాట్లాడకున్నా వార్తేనని ఆయన అన్నారు. వెన్నెముక లేని తెలంగాణ నాయకులే తెలంగాణ శాపమని ఆయన అన్నారు. తాము విశ్వప్రయత్నం చేశామని, రాజీనామా చేయాలని సూచించామని, రాజీనామాలు చేస్తే మళ్లీ గెలిపిస్తామని చెప్పామని ఆయన అన్నారు. నిజస్వరూపాలు బయటపడిన తర్వాత కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మెడ కత్తి పెట్టి తెలంగాణ ఇవ్వాలంటే ఇబ్బందులుంటాయని ప్రధాని అన్నారని ఆయన చెప్పారు. అడిగినందువల్ల కేంద్రానికి సమయం ఇచ్చామని ఆయన చెప్పారు. తనకేమీ కాలేదని, తాను సరిగానే ఉన్నానని, తమ వ్యూహాలు తమకు ఉంటాయని ఆయన అన్నారు.

By
en-us Political News

  
భవనం పైకప్పు సమీపంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో నాలుగో తరగతి చదువుతున్న రెబికా అనే 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన నందిని అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక పోతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.